`యజ్ఞ` మూవీ షూటింగ్ ప్రారంభం!!
`యజ్ఞ` మూవీ షూటింగ్ ప్రారంభం!!
మురళీ మూవీ క్రియేషన్స్ బేనర్ పై పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం `యజ్ఞ`. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో సుగమ్య శంకర్, నందిని , రాఘవ, చరణ్ జడ్చర్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భానుచందర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమన్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, కవిత, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టియఫ్సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, శ్రీమతి విజయలక్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండపాక శ్రీరామ మూర్తి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“దర్శక నిర్మాతలు ఇద్దరూ నాకు చాలా కావాల్సినవారు. సినిమా పట్ల ఎంతో అభిరుచి ఉన్న వ్యక్తులు. కథ విన్నాను. చాలా బాగుంది. సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి అవ్వాలని కోరుకుంటూ … సినిమా విడుదల విషయంలో మా తెలంగాణ చాంబర్ అన్ని విధాలుగా సాయపడుతుంది“ అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…“యజ్ఞ` టైటిల్ చాలా బావుంది. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు ప్రసాద్ గారు. కొత్త, పాత నటీనటులతో రూపొందుతోన్న ఈ చిత్రం యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకరావాలన్నారు.
దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ మాట్లాడుతూ…“హారర్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా `యజ్ఞ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్త, పాత నటీనటులు నటిస్తున్నారు. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు షూటింగ్ చేస్తాం. కొంత గ్యాప్ తర్వాత జనవరి 5నుంచి 15 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ ప్లాన్ చేశాం“ అన్నారు.
నిర్మాత పొందూరి రామ్మోహన్ రావు మాట్లాడుతూ…“మా చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిథులందరికీ నా ధన్యవాదాలు. ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాను. నా గత చిత్రాలన్నీ ఆదిరించారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారి కోరుకుంటున్నా“ అన్నారు.
హీరో రాఘవ మాట్లాడుతూ…“ యజ్ఞ ` చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయన్లు నందిని, సుగమ్య శంకర్ పాల్గొన్నారు.
భానుచందర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమన్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, కవిత, జబర్దస్త్ అప్పారావు, కోటకొండ కృష్ణ, కరుణాకర్, సికిందర్, భీమ్ రాజ్, రాజేష్, మునిచంద్ర, ధర్మతేజ, మల్లీశ్వరి, మంజుల, దీపిక, స్వర్ణలత, శ్రీజ రెడ్డి, దివ్య, సంజన తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః ఎస్.కరణ్, ప్రొడక్షన్ మేనేజర్ః శ్యామ్ కోట, కో-డైరక్టర్ః కొండా శ్రీనివాసరెడ్డి; కెమెరాః శ్రావణ్ కుమార్; సంగీతంః దేవేందర్; ఆర్ట్ డైరక్టర్ః శివ బోగోలు; కొరియోగ్రఫీః తాజ్ ఖాన్, ఫైట్స్ః హుస్సేన్ భాయ్; పాటలుః జి.సీతారామ చౌదరి, ఎస్ రఘుబాబు; పీఆర్వోః చందు రమేష్; నిర్మాతః పొందూరి రామ్మోహన్ రావు, కథ-స్ర్ర్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వంః చిత్తజల్లు ప్రసాద్.