Mystery Thriller Maha Releases Worldwide On July 22

 

హన్సిక- శింబు-యుఆర్‌ జమీల్‌- మదియళగన్‌- మిస్టరీ థ్రిల్లర్ ‘మహ’ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ప్రిన్సెస్ హన్సిక మోత్వాని టైటిల్ రోల్ లో స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై యుఆర్‌ జమీల్‌ దర్శకత్వంలో మదియళగన్‌ నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మహ’ చిత్రాన్ని జూలై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

యాక్షన్, సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘మహ’ హన్సిక 50వ చిత్రం కావడం విశేషం. స్టార్ హీరో శింబు కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. మహ టీజర్, ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.

జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జె లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించగా జాన్ అబ్రహం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: హన్సిక మోత్వాని , శింబు, శ్రీకాంత్ , కరుణాకరన్, తంబి రామయ్య తదితరులు
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: యు.ఆర్. జమీల్
నిర్మాత: మదియళగన్‌
బ్యానర్స్ : మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: లక్ష్మణ్
ఎడిటర్: జాన్ అబ్రహం
పీఆర్వో : తేజస్వి సజ్జ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *