శ్రీరంగాపురం మూవీ రివ్యూ!

 శ్రీరంగాపురం రివ్యూ!
న‌టీన‌టులుః    వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ,
చిత్రం శ్రీను, జబర్దస్త్  రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు తదితరులు
సాంకేతిక నిపుణులుః
నిర్మాతః చింద‌నూరు నాగ‌రాజు,
ద‌ర్శ‌క‌త్వంః ఎమ్ ఎస్ వాసు
సంగీతంః స్వ‌ర సుంద‌రం
రేటింగ్ః 3.5/5

శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై చిందనూరు విజయలక్ష్మి సమర్పణలో తెరకెక్కిన చిత్రం శ్రీరంగాపురం.   వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిందనూరు నాగరాజు నిర్మించారు. M.S. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  లవ్ అండ్ ఫ్యామిలీ ఎటర్టైనర్ గా తెర‌కెక్కింది. మ‌రి ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
స్టోరి విష‌యానికొస్తే..
శ్రీరంగాపురం అనే ఒక  గ్రామంలో పెద్దరెడ్డి (చిందనూరు నాగరాజు) అనే ఒక పెద్దాయ‌న ఉంటాడు. ఆయ‌న‌కు మ‌హాల‌క్ష్మి అనే ఒక ముద్దుల మేన‌ కోడలు ఉంటుంది. మేన కోడ‌లే ప్రాణంగా బ‌తికే ఆ  పెద్దాయ‌న జీవితంలో ఎలాంటి మ‌లుపులు తిరిగాయి. చివ‌రికి ఆయ‌న ఆమె ప్రేమ కోసం ఎలాంటి త్యాగం చేశాడు అనేది క‌థ తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
ఆర్టిస్ట్స్ ప‌ర్ఫార్మెన్స్ః
వినాయ‌క్ అనే కొత్త కుర్రాడు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కొత్త‌వాడైనా మంచి ఈజ్ తో న‌టించాడు.  అమాయికుడైన ప‌ల్లెటూరి కుర్రాడిగా  అత‌ని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది. అలాగే పాయ‌ల్ ముఖ‌ర్జీ ప‌ల్లెటూరి అమ్మాయిగా, ముద్దుల మ‌హాల‌క్ష్మిగా మెప్పించింది. ఇక ఇందులో హీరోయిన్ మేన‌మామ‌గా సినిమాకు ఎంతో కీల‌క‌మైన పాత్ర‌లో, పెద్దారెడ్డిగా గా చింద‌నూరు నాగ‌రాజు న‌టించారు. ఒక వైపు ప్రేమ పంచే మేన‌మామ‌గా, గ్రామ పెద్దగా రెండు వేరియేష‌న్స్ లో అద్భుతంగా న‌టించాడు.  విలన్ పాత్రలో సత్య ప్రకాశ్ తన దైన స్టైల్లో నటించాడు. అతని కొడుకుగా రోబో గణేశ్ సైకో పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రలలో చిత్రం శ్రీను, జబర్దస్త్  రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు క‌డుపుబ్బ న‌వ్వించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ద‌ర్శ‌కుడు మేన‌మామ‌, మేన‌కోడ‌లు మ‌ధ్య అటాచ్ మెంట్ ఎలా ఉంటుందో తీసుకుని దానికి చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్, ల‌వ్ సీన్స్ , కామెడీ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో క్లాస్ తో పాటు మాస్ ఆడియ‌న్స్ ని మెప్పించే చక్క‌టి స‌న్నివేశాలు పొందుప‌రిచారు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగ చూపించారు. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ని బాగా క్యాప్చర్ చేశారు. పాటలు బాగున్నాయి ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఎడిటింగ్ ప‌ర్వాలేదు. నిర్మాత క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చు పెట్టాడు.
విశ్లేష‌ణ‌లోకి వెళితే…
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కే ప్రేమ కథా చిత్రాలు ఎప్పుడూ బావుంటాయి. గ్రామాల్లో ఉండే ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో పాటు, ప్రేమ , ఆప్యాయ‌త‌లు చ‌క్క‌గా చూపించారు.  మేన‌మామ అంటే తండ్రి త‌ర్వాత తండ్రి అంత‌టి వాడు అంటారు. ఆ అంశాన్ని శ్రీరంగా పురం చిత్రంలో ఎంతో చ‌క్క‌గా చూపించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. త‌న మాట కోసం కాకుండా త‌ను ఎంత‌గానో ప్రేమించే మేన‌కోడ‌లు కోసం త‌న ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా ఆ మేన‌మామ చేసిన త్యాగం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.  ప్రతి మేన మామ తన మేనకోడలు పట్ల ఎలా వుండాలి అనేది ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. సెంటిమెంట్, మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వారం విడుద‌లైన చిత్రాల్లో త‌ప్ప‌కుండా చూడాల్సిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శ్రీరంగాపురం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *