“దోచేవారెవారురా” చిత్రం శివ నాగేశ్వర రావు గారి స్టైల్ లో ఉండబోతొంది : దర్శకుడు అనిల్ రావిపూడి !!

“దోచేవారెవారురా” చిత్రం శివ నాగేశ్వర రావు గారి స్టైల్ లో ఉండబోతొంది : దర్శకుడు అనిల్ రావిపూడి !!

IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఒక సాంగ్ కోసం రామోజీఫిలిం సిటీలో ఒక సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు.ఈ పాట ను రమ్య బెహర్ అద్భుతం గా పాడింది.. సినిమా లో ఒక ముఖ్య సందర్భంలో ఈ సాంగ్ రాబోతోంది.

తాజాగా ఈ సినిమాలోని గుండాగాళ్లమండి.. లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… “సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా శివ నాగేశ్వరరావు గారి స్టైల్ లో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఈ చిత్రం విజయం సాధించాలని.. చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

దర్శకులు: శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
నిర్మాణం: IQ క్రియేషన్స్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *