ఒట్టు నా బొమ్మ హిట్టు

ఒట్టు నా బొమ్మ హిట్టు

నవ్వుతూ నవ్విస్తారు మా “నటరత్నాలు” అంటున్నాడు వాళ్ళను తెర మీద చూపించే మార్గ దర్శకుడు శివనాగు. నటరత్నాలు ఏం చేస్తున్నారు అంటే.. ప్రసాద్ ల్యాబ్ లో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో మెరుగులు దిద్దుకుంటున్నారు.

అదిగో పైనున్న ఫోటో లో నేను ఎలా నవ్వుకుంటున్నానో చూశారుగా అదే మాదిరిగా ప్రసాద్ ల్యాబ్ లో నా పక్కన కూర్చుని వర్క్ చేస్తూ కూర్చున్న డబ్బింగ్ ఇంజనీర్ వేణు గారు డబ్బింగ్ ఇంచార్జ్ సురేష్ గారు, కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ లు నటరత్నాలు ని చూస్తూ విరగబడి పగలబడి నవ్వుకుంటుంటే – మా నటరత్నాలు తెరమీద కామెడీ పంటని మరీ ఎక్కువగా పండించినట్టున్నారు బాబోయ్ అనిపించింది నాకు అని తెగ నవ్వేశాడు శివనాగు.

సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ లకు ఛాన్స్ ఇస్తే మరీ ఇంత ఎక్కువగా కామెడీ ని చింపి చాట చేస్తారని అనుకోలేదురా బాబోయ్.. వీళ్ళు అలా ఉంటే నటరత్నాలతోనే అదే తెరమీద చంటి, టైగర్ శేషాద్రి, విష్ణు వర్ధన్, సుమన్ శెట్టి, ఏ ఎస్ రవికుమార్ చౌదరి, సూర్యకిరణ్, అర్చన లు ప్రస్తుతం బిగ్ బాస్ లో నోరేసుకుని బూతులు తిడుతున్న ఇనయా సుల్తానా లు వాళ్ళలో ఉన్న నటనా రసాల్ని పిండి పిప్పి చేశారు. అది చూసి క్రియేటర్ శివనాగు పగలబడినవ్వుతూ ఒట్టు నా బొమ్మ హిట్టు అని బల్ల గుద్దాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *