“సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌“ మూవీ రివ్యూ!!


“సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌“ మూవీ రివ్యూ!!
నటీన‌టులుః
హీరోః రణధీర్ , హీరోయిన్ః  నందిని
ముఖ్యపాత్రల్లో సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి,
సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌,
లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌..సాంకేతిక నిపుణులుః
బేన‌ర్ః శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌
డిఓపి: విజయ్‌ కుమార్‌ ఎ. ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎన్టీఆర్‌,
సంగీతం: ఎస్‌.ఎస్‌.నివాస్‌, ఫైట్స్‌: రామ్‌ సుంకర,
కొరియోగ్రఫీ: అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌,
పిఆర్ఓ: చందు రమేష్,
కథ- కథనం-మాటలు-దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు
రేటింగ్ః 3.5/5

టైటిల్ ద‌గ్గ‌ర నుంచి పాట‌లు, ట్రైల‌ర్స్ తో క్యూరీయాసిటీ  పెంచిన  చిత్రం  “సీతారామపురంలో ఒక ప్రేమ జంట“.  ఈ చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్స్ లో విడుద‌లైంది. మరి ఈ చిత్రం తెవ్యూ ఎలా ఉందో    తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం….

కథ:
సీతారామ పురం అనే ఒక గ్రామంలో ప‌టేల్ (సుమ‌న్‌) అనే ఒక స‌ర్పంచ్ ఉంటాడు. ఆ స‌ర్పంచ్‌కి నందు   ( హీరోయిన్ నందిని) అనే ఒక అంద‌మైన డాటర్  ఉంటుంది. అదే ఊరిలో న‌ర్సింహ గౌడ్  (సూర్య‌)మాజీ స‌ర్పంచ్ కొడుకు శివ (ర‌ణ‌ధీర్‌) నందు ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి చ‌దువుకుంటారు. దీంతో వారి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ హీరోయిన్ నందుకి మేన‌బావ ( అమిత్‌)  ఉంటాడు. అత‌నికి ఇచ్చి పెళ్లి చేయాల‌న్న‌ది ప‌టేల్ ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలో నందు, శివ ల ప్రేమ విష‌యం పెద్ద‌ల‌కు తెలుస్తుంది. ఇద్ద‌రి ఇంట్లో వార్నింగ్ ఇస్తారు. దీంతో ఒకానొక రోజు హీరో హీరోయిన్ లేచిపోతారు.  దీంతో ఇద్ద‌రి ఇంట్లో పెద్ద‌లు రాజీ కొచ్చి .. వెత‌కడం ప్రారంభిస్తారు. కానీ అప్ప‌టికే నందుతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమిత్ కి అది  న‌చ్చ‌దు .   అమిత్ ఎలాగైనా త‌న మేన మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుని ప‌టేల్  ఆస్తి  కొట్టేయాల‌ని రౌడీల‌ను తీసుకొని హీరో హీరోయిన్ల‌ను వెతికి ప‌ట్టుకుంటాడు.  ఆ త‌ర్వాత ఏమైంది?  హీరో హీరోయిన్ల‌ను అమిత్  ఏం చేసాడు? ఎంతో గాఢంగా ప్రేమించిన హీరో శివ కోసం హీరోయిన్ నందు ఏం చేసింది? అనేది క్లైమాక్స్.  ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల హావ‌భావాలుః
హీరో ర‌ణ‌ధీర్ ఈ చిత్రంతో  హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. త‌న‌కు తొలి సినిమా అయినా ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడు. ఒక ప‌ల్లెటూరి కుర్రాడిగా, ల‌వ‌ర్ బాయ్ గా మెప్పించాడు.  ఇంకా కొంచెం మెరుగులు దిద్దుకుంటే మాస్ హీరోగా ఎదిగే అవ‌కాశాలు ఉన్నాయి. డాన్స్ ల్లో, ఫైట్స్ లో ఈజ్ క‌న‌బ‌రిచాడు.  ఒక ప‌ల్లెటూరి గ‌డుసుపిల్ల‌గా నందిని అద‌ర‌గొట్టింది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.  తెలంగాణ స్లాంగ్ లో త‌ను చెప్పిన డైలాగ్స్ తో సినిమా ఫ‌స్టాప్ అంతా ఎంతో ఎంట‌ర్ టైనింగ్ గా సాగింది.  హీరోయిన్ అందంతో పాటు అభిన‌యం ఆక‌ట్టుకుంది. హీరోయిన్‌కి చెప్పిన డ‌బ్బింగ్ కూడా బావుంది.  సుమ‌న్‌, సూర్య‌, మిర్చి మాధ‌వి పాత్ర‌లు  సినిమాకు కీల‌కం. హీరో హీరోయిన్స్ ఫ్రెండ్స్ పాత్ర‌లు కూడా న‌వ్విస్తాయి.  అమిత్ ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
కథ, కథనాలు , సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్   సినిమాకు ఆయువుపట్టు .   ద‌ర్శ‌కుడు తాను రాసుకున్న కథను తెరకెక్కిచడం లో సక్సెస్ అయ్యాడు.    తెలంగాణ స్లాంగ్ లో ద‌ర్శ‌కుడు రాసిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి.    నిర్మాత  ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ‌కు ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టారు.

అనాలసిస్:
సినిమా మొదటి భాగం ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది.  ముఖ్యంగా
హీరోయిన్ తెలంగాణ స్లాంగ్ లో చెప్పే డైలాగ్స్   , హీరో హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే  ల‌వ్ సీన్స్  ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా మినహా  ద‌ర్శకుడు సినిమాను ఆద్యతం ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దాడు.  విన‌సొంపైన  పాట‌లు,  అద్భుత‌మైన‌  లొకేష‌న్స్, అంద‌మైన హీరో హీరోయిన్ జంట‌, సినిమాటోగ్ర‌ఫీ ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాని త‌ప్పకుండా చూడాల్సిందే. చాలా కాలం త‌ర్వాత స్వ‌చ్ఛ‌మైన , అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థతో వ‌చ్చిన చిత్ర‌మిది.   ఇంటిల్లిపాది హాపీ గా చూడాల్సిన సినిమా సీతారామపురం లో ఒక ప్రేమ జంట .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *