*దర్శకుడు నర్రా శివనాగు కి అరుదైన గౌరవం*

*దర్శకుడు నర్రా శివనాగు కి అరుదైన గౌరవం*

ఏ‌పి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన ఎన్నారైలు, ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో నిన్న సాయంత్రం దర్శకుడు నర్రా శివనాగుకి IAPC ఇంటర్నేషనల్ అవార్డుని ప్రదానం చేయటం జరిగింది. విజయవాడ ప్రజానీకం ఆనందోత్సాహాలతో హాజరై ఈ సత్కార కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.
NRI బిషప్ ప్రవీణ్ వర్మ, దర్శకుడు నర్రా శివనాగుని కొనియాడుతూ ఆయన ఆలోచనా విధానం, ఆయన ధైర్య సాహసాలు, దర్శకత్వ ప్రతిభకు తార్కాణంగా “దేవినేని” చిత్రానికి గాను, ఆయన ధైర్య సాహసాలతో తెగింపుతో ఒక ఒరిజినల్ కథను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రజలలోకి తీసుకురావటం గొప్ప విషయం. ఆయన ధైర్య సాహసాలే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచాయి. మా సంస్థ తరపున ఆయనను ఉత్తమ అంతర్జాతీయ దర్శకుడిగా ఏ‌పి ప్రభుత్వం తరపున మా IAPC సంస్థ ఇంటర్నేషనల్ అవార్డుని బహూకరించటం జరిగింది. IAPC ఇంటర్నేషనల్ సంస్థ CEO గా నేను ఇందుకు చాలా గర్వ పడుతున్నాను.
ఇట్లు
ప్రవీణ్ వర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *