ప్రామిసింగ్ డైరెక్టర్ గా నర్రా శివనాగు కు అరుదైన గౌరవం
ప్రామిసింగ్ డైరెక్టర్ గా నర్రా శివనాగు కు అరుదైన గౌరవం
ప్రామిసింగ్ డైరెక్టర్ గా I.A.P.C. ఇంటర్నేషనల్ (U.S.) అవార్డ్ అందుకున్న ‘నర్రా శివనాగు’.
సినిమాలే ఊపిరిగా, సినిమాలే ప్రాణంగా, సినిమాలే జీవితంగా, సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ, ముప్పై సంవత్సరాలుగా సినిమా రంగంలో అలుపెరుగని ప్రయాణం దిగ్విజయంగా సాగిస్తున్న నర్రా శివనాగు ని I.A.P.C. International Award (U.S.) వరించింది.
సినిమా ప్రారంభించి, అది పూర్తి అయ్యేవరకు మనసు పెట్టి శ్రమిస్తాడు. సినిమా పూర్తి అయితే బిజినెస్ చేసి మార్కెట్ లోకి విడుదల అయ్యేవరకు నిద్రపోడు. మేకింగ్ లో కాని రిలీజ్ లో కాని ఎంత కష్టమైనా, నష్టమైనా భరించి, తెగించి, ధైర్య సాహసాలతో ముందుకు ప్రయాణం సాగిస్తాడు. విడువని పట్టుదలతో, మొండి తెగువతో వందమంది పెట్టుగా ఒక్కడే పనిచేస్తూ వెళ్తూ ఉంటాడు. సినిమా పట్ల ఆయన తపనను, కష్టాన్ని, గమనించిన I.A.P.C. సంస్థ ఇండియన్ ఫిల్మ్ ప్రామిసింగ్ డైరెక్టర్ గా ఇంటర్నేషనల్ అవార్డ్ తో తెలుగు డైరెక్టర్ నర్రా శివనాగు ని గుర్తించి, గౌరవించటం గొప్ప విశేషం.