క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా `నువ్వే నా ప్రాణం`
నటీనటులుః కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే, సుమన్, భానుచందర్, తిలక్, గిరి, సోనియా చౌదరి తదితరులు
సంగీతంః మణిజెన్నా,
నేపథ్య సంగీతంః రాజా
ఫైట్స్ః మల్లి
నిర్మాతః శేషు మలిశెట్టి
దర్శకత్వంః శ్రీకృష్ణ మలిశెట్టి
రేటింగ్ః 3.5/5వరుణ్ క్రిష్ణ ఫిలింస్ పతాకంపై కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా శ్రీక్రిష్ణ మలిశెట్టి దర్శకత్వంలో శేషు మలిశెట్టి నిర్మించిన చిత్రం ‘నువ్వే నా ప్రాణం!’. పాటలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం ఈ వారం థియేటర్స్ లో (డిసెంబర్ 30)న విడుదలైంది. మరి ప్రేక్షకుల్లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథః
సంజు ( హీరో కిరణ్ రాజ్) హ్యాపీ గో యింగ్ లక్కీ గాయ్ గా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ కిరణ్మయి (హీరోయిన్ ప్రియా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ఆమె పొందడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అల్లరి చిల్లరగా తిరిగే పోరంబోకు అనుకోని సంజుని కిరణ్మయిని పట్టించుకోదు. కానీ ఒక ఇన్స్ డెంట్ తో సంజు పోలీప్ ఆఫీసర్ అని తెలుస్తుంది. ఆ ఇన్స్ డెంట్ తో కిరణ్మయి కూడా సంజు ప్రేమలో పడుతుంది. హీరో, హీరోయిన్ల ఫాదర్స్ కూడా ఫ్రెండ్స్ కావడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత హీరో లైఫ్ లోకి ఒక తీవ్రవాది ఎంటర్ అవుతాడు. ఈ నేపథ్యంలో సంజు, కిరణ్మయి మధ్య చిన్న భేదాభిప్రాయాలు రావడం..అవి చిలికి చిలికి విడాకులు వరకు దారి తీస్తాయి. అసలు వాళ్లిద్దరి మధ్య ఎందుకు దూరం పెరిగింది. సంజు వెంటపడుతున్న ఆ తీవ్రవాదులు ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…స్టోరిలోకి వెళితే…
గైనకాలజిస్ట్ అయిన కిరణ్మయి( పూజా హెగ్డే)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు ఐపియస్ ఆఫీసర్ అయిన ( హీరో కిరణ్ రాజ్) సంజు. కిరణ్మయిని ప్రేమలో పడేయడానికి నానా తంటాలు పడి తన మనసును గెలుచుకుంటాడు సంజు. ఇరు కుటుంబాల ఒప్పందంతో పెళ్లి చేసుకుంటారు. ఇలా చాలా సాఫీగా సాగిపోతున్న సంజు జీవితంలోకి కొంత మంది తీవ్రవాదులు ఎంటరవుతారు. ఈ క్రమంలోనే సంజుకి, కిరణ్మయికి మధ్య మనస్పర్థలు వచ్చి అవి విడాకులు వరకు దారి తీస్తాయి. అంతగా ప్రేమించిన సంజు…కిరణ్మయిని ఎందుకు కాదనుకుంటాడు? అసలు ఆ తీవ్రవాదులు సంజు వెంట ఎందుకు పడుతున్నారు? చివరకు సంజు, కిరణ్మయి ఒకటవుతారా? లేదా? తెలియాలంటే `నువ్వే నా ప్రాణం` చిత్రం చూడాల్సిందే.ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్సెస్ః
కిరణ్ రాజ్ చాలా ఈజ్ తో నటించాడు. డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గ్లామర్, పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే సుమన్, భానుచందర్ ఇద్దరు కూడా రియల్ లైఫ్ లాగే సినిమాలో కూడా మంచి మిత్రులుగా నటించారు. ఎప్పటిలాగే వారి పాత్రలకు న్యాయం చేశారు. వీరితో పాటు ముఖ్య పాత్రల్లో గిరిధర్ , సోనియా చౌదరి నటించారు. వీరి పాత్రలు ఫన్ తో పాటు నేటి భార్య భర్తలు ఎలాంటి భ్రమల్లో బ్రతుకుతున్నా రో చూపించారు.టెక్నీషియన్స్ వర్క్ః
క్యూట్ లవ్ స్టోరికి మంచి సందేశాన్ని జోడించి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా `నువ్వే నా ప్రాణం` చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి. హైఫై ఫ్యామిలీస్ లో భార్య భరత్తలు చిన్న చిన్న మనస్ఫర్థలతో తమ జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారో..చూపిస్తూనే దానికి మంచి సొల్యూషన్ కూడా ఇచ్చారు దర్శకుడు. రియాలిటీకి దగ్గరగా ఉండే చిత్రమని చెప్పొచ్చు. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడలేదు. ఒక సీనియర్ దర్శకుడు చేసిన విధంగా ప్రతి సన్నివేశం ఎంతో మెచ్యూరిటీతో తెరకెక్కించారు. అక్కడక్కడా ల్యాగ్ అయిన ఫీలింగ్ తప్ప ఎక్కడా బోర్ లేకుండా సినిమా అయి పోయిన ఫీలింగ్ కలుగుతుంది. సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. పాటలన్నీ వినడానికీ, చూడటానికీ బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంది. నిర్మాత శేషు మలిశెట్టి ఎక్కడా రాజీ పడలేదు. నటీనటులు, టెక్నీషియన్స్ దగ్గర నుంచి వర్క్ రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు అనడంలో సందేహం లేదు.
సూటిగా చెప్పాలంటేః
ఈ మధ్య కాలంలో ఇలాంటి క్లీన్ ఫ్యామలీ ఎంటర్ టైనర్ చిత్రాలు చాలా అరుదుగా వస్తున్నాయి. మాటలు చాలా అర్థవంతంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. టీమ్ అంతా ప్రాణం పెట్టి సినిమా చేశారు. ఒక మంచి సందేశం తో పాటు వినోదం కావాలంటే ప్రతి ఫ్యామిలీ వెళ్లి చూడాల్సిన సినిమా `నువ్వే నా ప్రాణం`.