ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసిన ‘దేశం కోసం భగత్ సింగ్` ట్రైల‌ర్‌

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసిన ‘దేశం కోసం భగత్ సింగ్` ట్రైల‌ర్‌

గ‌తంలో అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం లాంటి చిత్రాల‌ను నిర్మించిన నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. ర‌వీంద్రజి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవ‌ల లాంచ్ చేసి చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించారు.
ఈ సంద‌ర్భంగా ర‌వీంద్ర‌గోపాల మాట్లాడుతూ…“తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఎవ‌రూ చేయ‌న‌టువంటి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెర‌కెక్కించిన‌ చిత్రం `దేశం కోసం భగత్ సింగ్`. మా చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌రించి.. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాను ఫిబ్రవరి 3న విడుద‌ల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఈ చిత్రానికి కెమెరాః సి. వి. ఆనంద్, సంగీతంః ప్ర‌మోద్ కుమార్‌, మాట‌లుః సూర్యప్ర‌కాష్,రవీంద్ర గోపాల, పాట‌లుః ర‌వీంద్ర గోపాల‌, ఎడిటింగ్ః రామారావు, కోడైరెక్ట‌ర్ః రామారావు, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాతః ర‌వీంద్ర‌జి.
బ్యాన‌ర్ః నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *