*నటరత్నాలు సినిమా డిజిటల్ పబ్లిసిటీ పోస్టర్ లాంచ్ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మెరుగు నాగార్జునగారు*
*నటరత్నాలు సినిమా డిజిటల్ పబ్లిసిటీ పోస్టర్ లాంచ్ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మెరుగు నాగార్జునగారు*
ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చందన ప్రొడక్షన్స్ సమర్పణలో డాక్టర్ దివ్య, యలమాటి చంటి, ఆనంద్ దాస్ శ్రీమణికంఠ నిర్మించిన చిత్రం “నటరత్నాలు”. బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా, రంగస్థలం మహేష్, సుదర్శన్ రెడ్డి, తాగుబోతు రమేష్ అర్జున్ తేజ్ “నటరత్నాలు”. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల ప్రశంసలతో యూఏ సర్టిఫికెట్ ని అందుకున్న ఈ “నటరత్నాలు” మూవీ ప్రచార పనులలో భాగంగా మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున గారి చేతుల మీదుగా డిజిటల్ పబ్లిసిటీ పోస్టర్ ను ఆంధ్ర ప్రాంతంలో మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మంత్రి నాగార్జున గారు మాట్లాడుతూ.. “సీనియర్ దర్శకులు నర్రా శివనాగు దర్శకత్వం వహించిన చిత్రం తప్పక విజయవంతం కావాలని మా తమ్ముడు ఎలమటి చంటికి మిగతా నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.