ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ‘హలో బేబీ’ చిత్రం ప్రారంభోత్సవం
ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ‘హలో బేబీ’ చిత్రం ప్రారంభోత్సవం
ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్.7 చిత్రం “హలో బేబీ”. ఈ చిత్రం ప్రారంభోత్సవం ప్రముఖ దర్శకుడు యాదకుమార్ క్లాప్ తో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అరోరాశ్రీ హీరోయిన్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాత కాండ్రేగుల..” ఆదినారాయణ మాట్లాడుతూ ఇప్పటికి ఆరు చిత్రాలు నిర్మించాను. డిస్ట్రిబ్యూటర్ గా అనేక చిత్రాలను రిలీజ్ చేసాను. ఇది నా బ్యానర్ లో ఏడవ సినిమా. దర్శకుడిగా రాంగోపాల్ రత్నంను వెండితెరకు పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రం కథ ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో రాలేదు.
ఇలాంటి ఒక కథ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
కెమెరామెన్ గా రమణ, మ్యూజిక్ డైరెక్టర్ గా నితిన్, ఎడిటర్ గా సాయిరాం తాటిపల్లి తదితర టాలెంటెడ్ టెక్నీషియన్స్ మా చిత్రానికి పనిచేస్తున్నారు” అన్నారు.
దర్శకుడు రాంగోపాల్ రత్నం మాట్లాడుతూ..” ఇదొక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ అరోరాశ్రీ కి మంచి పేరు వస్తుంది, ఇలాంటి మంచి కథతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథ వినగానే కచ్చితంగా చేయాలి అనే సంకల్పంతో ఈ సినిమాను కసితో చేస్తున్నాను” అన్నారు.
హీరోయిన్ ఆరోరా శ్రీ మాట్లాడుతూ..” ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ తో ముందుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఇది విభిన్నమైనటువంటి కథ. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు” అన్నారు.