Tagubothu ramesh special song in “Nataratnalu”

“”నటరత్నాలు”” లో తాగుబోతు రమేష్ మందేసి, చిందేసిన స్పెషల్ సాంగ్

ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై డా. దివ్య నిర్మాతగా అనందాసు శ్రీమణికంఠ సహా నిర్మాతగా పూర్తి క్రైం, కామెడీ నేపథ్యంలో డేరింగ్ డైరెక్టర్ నర్రా శివనాగు దర్శకత్వం వహించిన చిత్రం “”నటరత్నాలు”” పాటలతో సహా షూటింగ్ పూర్తి చేసుకుంది.

కధ, కథనం ఈ చిత్రానికి హైలెట్ కాగా మరో హైలెట్ ఏమిటంటే …
తాగుబోతు రమేష్ స్పెషల్ అప్పీయరెన్స్ గా చిందేసిన ఒక మందు సాంగ్, ఒక బిగ్ బార్ అండ్ రెస్టారెంట్ లో చిత్రీకరించడం జరిగిందనీ, యూత్ ఆడియెన్స్ కు ఈ సాంగ్ విపరీతంగా కనెక్ట్ అయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని నిర్మాత డా. దివ్య తెలిపారు. తాగుబోతు రమేష్ మందేసి, చిందేసి చేసిన ఆటా, పాటా గల ఈ స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికే హైలెట్ అని దర్శకుడు నర్రా శివనాగు తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న “”నటరత్నాలు”” మూవీ లో మందు సాంగ్ కొరియోగ్రఫీ విజయ్ మాస్టర్ కాగా మిగతా సాంగ్స్ కొరియోగ్రఫీ గోపి మాస్టర్ చేయగా, లిరిక్స్ సీతారామ్ చౌదరి అందించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *