స్టిల్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా 25 వ వార్షికోత్సవం

స్టిల్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా 25 వ వార్షికోత్సవం వేడుకలను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మీర్,ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, బుల్లితెర ఛాయాచిత్రకారుడు పోతన ఓం ప్రకాష్, ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్, నిర్మాతల మండలి జనరల్ సెక్రటరీ, తెలుగు చాంబర్ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య తిధులు పోతన ఓం ప్రకాష్ గురించి మాట్లాడుతూ ఓం ప్రకాష్ టీవీ పరిశ్రమలో దాదాపుగా 20వేల ఎపిసోడ్లు పైగా తీసిన మొట్టమొదటి కెమెరామెన్ మన ఓం ప్రకాష్ అని కొనియాడారు కెమెరామెన్ రంగంలో ఎంతో ప్రతిభ కనబరిచిన మన పోతన ఓం ప్రకాష్ ని.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి అవార్డు ఇచ్చారు ఎప్పటికీ టీవీ ఇండస్ట్రీలో కెమెరామెన్ లాగా పని చేస్తున్న చాలామంది వ్యక్తులు కూడా మన ఓమ్ ప్రకాష్ దగ్గర శిష్యరికం చేసిన వ్యక్తులు.. ఇలా ఎంతోమందిని టీవీ పరిశ్రమకు కెమెరామెన్లు అందించిన ఘనత మన పోతన ఓం ప్రకాష్ ది అని ప్రముఖులు కొనియాడారు ఫోటోగ్రఫీ రంగంలో పేరెన్నిక గల కేవై గిరిరాజు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాటి నుండి నేటి వరకు ఏకగ్రీవంగా కొనసాగుతూ ఇటు పరిశ్రమకు, అటు అసోసియేషన్ కు సేవలందించడం గర్వకారణంగా ఉందని సీనియర్ సినిమాటోగ్రాఫర్ మీర్, బుల్లితెర కెమెరామెన్ ఓం ప్రకాష్ లు కొనియాడారు. యూనియన్ ను అభివృద్ధి పధం లో నడిపిస్తున్న పాలకవర్గ సభ్యులు అధ్యక్షుడు కేవై గిరిరాజు, మరియు కార్యవర్గ కమిటీ సభ్యులందరూ మరియు ముఖ్య అతిథులు అందరూ కలిసి పోతన ఓం ప్రకాష్ కు గజమాలతో సత్కరించారు. వైస్ ప్రెసిడెంట్ చిలంకుర్తి శేషు ఆద్వర్యంలో మేక్సీవిజన్ ఆసుపత్రి వారి సౌజన్యంతో డాక్టర్లు సభ్యులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. తొలిత హంశాంజలి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహణలో అనాధ చిన్నారులచే నృత్య ప్రదర్శనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆర్గనైజింగ్ సెక్రెటరీలు బలగం సహదేవ్, సుంకరపల్లి సతీష్ నేతృత్వంలో సీనియర్ సబ్యులు సమక్షంలో 25 వసంతాల కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ కపూర్, పలువురు వర్ధమాన నటీనటులు ఆకర్షణగా నిలిచారు. సభ్యత్వం గల ఫోటోగ్రాఫర్ల కు ఈ సందర్భంగా జ్ఞాపికలను ముఖ్య అతిథి పోతన ఓం ప్రకాష్ గారిచేతుల మీదుగా అందజేశారు.
ఈసీ మెంబర్లు పి.శ్యాంబాబు,లక్కు శేషు, స్వామి నాయుడు,లాభాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *