*హలో బేబీ* ప్రమోషనల్ సాంగ్ ను లాంచ్ చేసిన హీరో *నవీన్ చంద్ర*

*హలో బేబీ* ప్రమోషనల్ సాంగ్ ను లాంచ్ చేసిన హీరో *నవీన్ చంద్ర*

*ఎస్ కె యల్ ఎమ్ పిక్చర్స్* పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రాంగోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి నటించిన *హలో బేబీ* చిత్రం ప్రమోషనల్ సాంగ్ ను హీరో నవీన్ చంద్ర లాంచ్ చేశారు. *హాల్లో బాయ్స్ లెట్స్ డు పార్టీ* అని మొదలుపెట్టిన ఈ పాటను సింగర్ *సాయి చరణ్* అద్భుతంగా పాడారు ఈ పాటను రాజేష్ లోక్నాథం రాశారు.
*హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ* సోలో క్యారెక్టర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రం కి ఆల్ ద బెస్ట్. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా సాహసం ఉండాలి. అలాంటి సాహసం చేసిన నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు దర్శకుడు రామ్ గోపాల్ రత్నం కు శుభాకాంక్షలు అని అన్నారు.

*నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ* సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. దీని కొరియోగ్రాఫర్ గా మహేష్ చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సుకుమార్ పమ్మి ,ఎడిటర్ సాయిరాం తాటిపల్లి.
ఈ చిత్రం ఒకే ఒక క్యారెక్టర్ తో కావ్య కీర్తి నటనతో త్వరలో ప్రేక్షకుల దగ్గరికి రాబోతుంది. కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *