టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026కు భారీ స్పందన.. జూన్ 21న హైదరాబాద్‌లో విజేతలకు అవార్డుల ప్రదానం” – టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్*

టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026కు భారీ స్పందన.. జూన్ 21న హైదరాబాద్‌లో విజేతలకు అవార్డుల ప్రదానం” – టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్*

చిత్ర పరిశ్రమలో న్యూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ కు భారీగా ఎంట్రీలు వచ్చినట్లు ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైటర్స్ అసోసియేషన్ నుంచి రవి మాస్టర్ కూడా పాల్గొన్నారు. ఈ అవార్డుల కమిటీ జ్యూరీకి ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర జ్యూరీ మెంబర్ గా నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో

*టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* – యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 నిర్వహిస్తున్నాం. ఈ నెల 13వ తేదీ వరకు ఎంట్రీలను ఆహ్వానించాం. మొత్తం 55 షార్ట్ ఫిలింస్ ఎంట్రీలు వచ్చాయి. ఇందులో అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. మా టీఎఫ్ సీసీ మీద ఉన్న నమ్మకంతో పెద్ద సంఖ్యలో షార్ట్ ఫిలింస్ ఎంట్రీలు పంపించారు. జ్యూరీ ఛైర్ పర్సన్ గా ఇంద్రజ గారు వ్యవహరిస్తారని ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర గారిని జ్యూరీ మెంబర్ గా తీసుకున్నాం. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. మాకు వచ్చిన ఎంట్రీలను జ్యూరీ సభ్యులు చూసి, ఉత్తమమైన వాటిని పరిశీలించి ఈ నెల 20వ తేదీ వరకే విజేతలను ఎంపిక చేస్తాం. మొత్తం 30 కేటగిరీలు ఉన్నాయి. దీంట్లో ఉత్తమ నటి, నటుడు, హీరో, హీరోయిన్, డైరెక్టర్…ఇలా ఉత్తమ ఫైట్ మాస్టర్ కు కూడా బహుమతి ఇస్తాం. ప్రింట్ అండ్ టీవీ మీడియా జర్నలిస్టులకు కూడా బహుమతులు ఇవ్వబోతున్నాం. వీలైనంత ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి విజేతలకు నగదు బహుమతి ప్రోత్సాహకం పెంచబోతున్నాం. ఈ నెల 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈవెంట్ నిర్వహిస్తాం. ఎంట్రీలు పంపిన ప్రతి ఒక్కరూ అవార్డ్స్ ప్రధానోత్సవానికి రావాలి. మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా టీఎఫ్ సీసీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా చూడొచ్చు. ఏటా ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తాం అన్నారు.

*రవి మాస్టర్ మాట్లాడుతూ* – ప్రతిభ గల కొత్త వారికి అవకాశాలు దక్కాలని, వారి ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రామకృష్ణ గౌడ్ గారు ఈ టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ కు మంచి స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో ఎంట్రీలు వజచ్చాయి. కర్ణాటక, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంట్రీలు రావడం సంతోషంగా ఉంది. సొంత ఖర్చుతో రామకృష్ణ గౌడ్ గారు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ లో మరింత భారీగా ఆయన ఈ అవార్డ్స్ ఈవెంట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుతున్నా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *