దర్శక, నిర్మాతలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌

దర్శక, నిర్మాతలకు
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌

ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ పున:ప్రారంభం అయిన నాటి నుండి
మన అసోసియేషన్‌ ఉనికిని చాటు కోవడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
అందులో భాగంగా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ముఖ్యులైన నిర్మాతలకు,
దర్శకులకు, నటీనటులకు వారి జన్మదినం సందర్భంగా ..కలిసి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్
తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఎన్నో విజయవంతమైన సినిమాలకు సహ నిర్మాతగా
వ్యవహరించిన వివేక్‌ కూచిభట్ల పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసాం. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్
అసోసియేషన్‌ యాభైఎనిమిది సంవత్సరాల వయసు గలది. సినిమా జర్నలిజంలో భీష్మాచార్యులైనటువంటి
పియస్‌ఆర్‌ ఆంజనేయ శాస్త్రి, గుడిపూడి శ్రీహరి,గౌతం, వరదాచారి లాంటి వారు స్థాపించిన సంస్థ ఇటీవలే పున:
ప్రారంభమైంది అని వారికి తెలియ చేసాం . ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు
బత్తులప్రసాదరావు, సీనియర్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ మామిడిపల్లి గిరధర్‌ లు
పాల్గొన్నారు. రచ్చ, బెంగాల్‌ టైగర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను తీసిన ప్రతిభావంతమైన యువ దర్శకుడు
సంపత్‌ నంది పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు పెద్దమ్మ గుడిలో కలిసిశుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ
కార్యక్రమంలో ఫిలింక్రిటిక్‌ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు, వైస్‌ ప్రసిడెంట్ మహమ్మద్‌ అబ్దుల్‌,
సహాయ కార్యదర్శి పర్వీన్‌ బాబి,సీరియర్‌ జర్నలిస్టు ఎఫ్‌.సి.ఏ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్ మామిడిపల్లి గిరిధర్‌ లు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *