జూలై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “ఆర్ కే దీక్ష” మూవీ
*జూలై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “ఆర్ కే దీక్ష” మూవీ*
– “ఆర్ కే దీక్ష” మూవీ ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయ్యింది
– నైజాంలోనే థియేటర్స్ ఇవ్వడం లేదు, దీనిపై పోరాటం చేస్తాం
– ఇండస్ట్రీలో ఆ నలుగురు చిన్న చిత్రాలను చంపేస్తున్నారు
– సోమవారం నుంచి ఫిలింఛాంబర్ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తాం
– ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా “ఆర్ కే దీక్ష” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మా మూవీ చాలా బాగా వచ్చింది. ఐదు పాటలు ఆకట్టుకుంటాయి. అందులో మధు ప్రియ మూడు పాటలు పాడింది. వీర జవాన్ల గొప్పదనం చెప్పేలా చేసిన స్పెషల్ సాంగ్ ను మధు ప్రియ పాడింది. ఆ పాట మా మూవీకి హైలైట్ అవుతుంది. ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ రవి మంచి యాక్షన్ సీక్వెన్సులు కంపోజ్ చేశారు. డూప్ లేకుండా మా హీరో కిరణ్ అద్భుతంగా ఆ ఫైట్స్ చేశాడు. అతనికి ఈ సినిమాతో హీరోగా మంచి పేరొస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ ను మా ఆర్కే ఆడియో లేబుల్ ద్వారా రిలీజ్ చేస్తాం. నేను నిర్మాతగా 44 చిత్రాలు చేశాను, దర్శకుడిగా 9 చిత్రాలు రూపొందించాను. “ఆర్ కే దీక్ష” సినిమాకు ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయ్యింది. నైజాంలోనే థియేటర్స్ ఇవ్వడం లేదు. ఇండస్ట్రీలోని ఆ నలుగురు థియేటర్స్ ను గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాను చంపేస్తున్నారు. మా సినిమాకు థియేటర్స్ ఇవ్వకుంటే పోరాటం మొదలుపెడతాం. సోమవారం నుంచి ఫిలింఛాంబర్ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేపడతాం. క్యూబ్ యూఎఫ్ఓ లతో దోపిడీ చేస్తూ, థియేటర్స్ లోనూ మోనోపలీ చేస్తున్నారు. చిన్న సినిమాల మనుగడ లేకుండా చేస్తున్న ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సినిమా బాగా లేకుంటే థియేటర్స్ నుంచి తీసేయడం వేరు, కానీ అసలు థియేటర్స్ ఇవ్వకుండా ప్రేక్షకులకు చిన్న సినిమా ఎలా చేరువ అవుతుంది. మా “ఆర్ కే దీక్ష” సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. బుక్ మై షోలో కూడా టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి అన్నారు.
ఫైట్ మాస్టర్ రవి మాట్లాడుతూ – రామకృష్ణ గౌడ్ గారు దర్శక నిర్మాతగా చేస్తున్న “ఆర్ కే దీక్ష” సినిమాకు నేను ఫైట్ మాస్టర్ గా వర్క్ చేశాను. హీరో కిరణ్ గారు ఫైట్స్ అద్భుతంగా చేశారు. ఎలాంటి రోప్స్ లేకుండా నాచురల్ గా యాక్షన్ సీక్వెన్సులు పర్ ఫార్మ్ చేశారు. రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలింఛాంబర్ తరుపున ఫైటర్స్ అసోసియేషన్ పెట్టి దాని సారథ్యం నాకు అప్పగించారు. మా ఫైటర్స్ అసోసియేషన్ లో 200 మంది ఫైటర్స్ ఉన్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ను ఇండస్ట్రీలోని కొందరు తక్కువ అంచనా వేస్తున్నారు. మా సినిమాకు థియేటర్స్ ఇవ్వకుండా ఆటంకాలు పెట్టొద్దని కోరుతున్నాం అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ – నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాను. రామకృష్ణ గౌడ్ గారు అనుకుంటే పేరున్న ఆర్టిస్టులతో భారీ బడ్జెట్ మూవీ చేయగలరు. కానీ మాలాంటి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న చిత్రాలు చేస్తున్నారు. ఆయన ఒక దీక్షలా ఈ సినిమాను కంప్లీట్ చేశారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన లాంటి వాళ్ల చిత్రాలకే థియేటర్స్ ఇవ్వకుంటే ఇక కొత్త వాళ్ల పరిస్థితి ఏంటి. మేము సినిమాను నమ్ముకుని ఉన్న వాళ్లం. థియేటర్స్ ఉంటేనే కదా మేము కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేది. దీనిపై తాడో పేడో తేల్చుకుంటాం. రామకృష్ణ గౌడ్ గారు ఎలా చెబితే అలాంటి పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ప్రేక్షకులు మాత్రం మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు.
నటి తులసి మాట్లాడుతూ – నేను “ఆర్ కే దీక్ష” సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అలేఖ్య రెడ్డి, అక్సఖాన్ కాంబినేషన్ లో నా సీన్స్ ఉంటాయి. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
నటీనటులు : కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.
టెక్నికల్ టీమ్:
———————–
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజ్ కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్

