“నా జీవితంలో ఎప్పుడూ ఊహించని సత్కారం ఇది” – పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్
“నా జీవితంలో ఎప్పుడూ ఊహించని సత్కారం ఇది” – పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక , భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చిరు సత్కారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బేల్ ట్రీ హోటల్స్ యజమాని మరియు నటుడు రాజారెడ్డి, తో పాటు శ్రీనివాస్‌రెడ్డిలు స్పాన్సర్స్ గా సహకరించారు. వారు రాజేంద్రప్రసాద్‌గారికి బొకేను అందజేసి పూలమాల వేసి శాలువా తో సత్కరించగా… ఫిలిం క్రిటిక్స్ గౌరవఅధ్యక్షులు ప్రభుగారు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావుగారు, ప్రధాన కార్యదర్శి సురేష్‌కొండేటిగారు కలిసి బొకేను అందజేసి మొమెంటోను రాజేంద్రప్రసాద్ కి అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా.. చలాకీగా.. చాకచక్యంగా.. చక్కని మాటలతో తీయని తేనె వంటి పలుకులతో ఆడిటోరియంలో అందరినీ ఉత్సహపరిచారు ఫిలిం క్రిటిక్స్ ట్రెజరర్ భరద్వాజ్‌గారు.
ఈ సందర్భంగా…ఫిలిం క్రిటిక్స్ గౌరవ అధక్షులు ప్రభు మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఫిలిం క్రిటిక్స్ వారు ఎన్నో కార్యక్రమాలు జరిపించారు. కానీ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రధాన కారణం స్పాన్సర్స్ రాజారెడ్డిగారు శ్రీనివాస్‌రెడ్డిగారు దొరకడం చాలా ఆనందం. వారు ఉండబట్టే ఈ కార్యక్రమానికి ఇంత చక్కని గ్రాండియర్ వచ్చింది. బేల్ ట్రీ హోటల్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఐదు దశాబ్దాలుగా మమేకమైన ఒక విశిష్టత కలిగిన నటుడు డా. రాజేంద్రప్రసాద్‌గారి గురించి ఏమి చెప్పినా తక్కువే. ఆయన నట జీవితం అనేది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో మంది హాస్యనటులు హీరోలుగా చేశారు. కానీ మొట్టమొదటి సారిగా నాకు తెలిసి హాస్య రసానికి హీరోయిజాన్ని పరిచయం చేసింది మాత్రం రాజేంద్రప్రసాద్‌గారే. హాస్యరసాన్ని పండించాలంటే చాలా కష్టం. దానికి ఒక గౌరవ ప్రదమైన స్థానాన్ని తీసుకువచ్చారు. గొప్ప నటనా ప్రస్ధానాన్ని తీసుకురావడం చాలా ఆనందం. నూతనంగా ఎన్నికైనా కార్యవర్గాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మంచి మంచి కార్యక్రమాల్ని చేసుకుంటూ వెళుతున్నందుకు ఫిలిం క్రిటిక్స్‌లోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం పని చెయ్యడమే కానీ మాట్లాడటం రానివాడ్ని నేను. రాజేంద్రస్రసాద్‌గారి గురించి చెప్పాలంటే మా ఇంట్లో పెద్దన్న లాంటివారు. ఆయన నా కుటుంబ సభ్యులతో సమానం. ఆయన తెరమీద ఏమి ఏమి చేసేవారో నేను నిజ జీవితంలో అవన్నీ చేసేవారిని. ఆయన పేరు ప్రసాద్.. నా పేరు ప్రసాద్ ఆయన్ని సినిమాల్లో చూసి నేను బయట చాలానే చేసేవాడ్ని. ఈ సన్మానం ఆయన్ని సన్మానించినట్లు కాదు మన కుటుంబంలో ఒక వ్యక్తిగా మనల్ని మనం సన్మానించినట్లు అనుకుంటున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ సెక్రటరీ సురేష్‌కొండేటి మాట్లాడుతూ… ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారాలు వేరు ఈ సత్కారం వేరు అనే విధంగా చేయడానికి సహకరించిన రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. రాజేంద్రప్రసాద్‌గారిని కలిస్తే చాలు అనుకునే వారిలో నేను ఒకడ్ని. అలాంటిది ఆయన్ని ఆరోజు దగ్గరనుంచి చూశాను. ఏ మాత్రం గర్వం లేకుండా నాతో చాలా చక్కగా మాట్లాడారు. నా ఈ జర్నలిజం ఎదుగుదలకు తోడ్పాటుగా ఉన్నారు. బాపుగారి సినిమాలో నటించడం అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదే విధంగా మా ఫిలిం క్రిటిక్స్ టీమ్ అంతా కూడా చాలా కష్టపడుతున్నారు. పేరు పేరునా మా టీమ్ అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
నటులు బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ… మేం తిరుమల కొండ పైన పుట్టి పెరిగాం. ఫ్యామిలీ మొత్తం చూడాలంటే కేవలం రాజేంద్రప్రసాద్‌గారి సినిమాలే చూసేవాళ్ళం. అలాంటి ఒక టైంలో రాజేంద్రప్రసాద్‌గారు కొండపైన ఒక గెస్ట్ హౌస్‌ని నిర్మించారు. నేను ప్రతి రోజు ఆయనను చూడడానికి అక్కడికి వెళ్ళేవాడిని ఆయన కనిపిస్తారేమో అని. కానీ ఆయన అక్కడ ఉండేవారు కాదు. అప్పట్లో తిరుపతికి ఎవరైనా వస్తే రాజేంద్రప్రసాద్‌గారి గెస్ట్ హౌస్‌లో ఉన్నాం అనేవారు. ఆయనకు అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గెస్ట్ హౌస్ కట్టడం అంటే మాములు మాటలు కాదు. నేను ఈ రోజు సార్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనని కలవడానికి ఇచ్చిన అవకాశాన్ని గొప్పగా భావిస్తున్నాను అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్‌గారు మాట్లాడుతూ…రాజేంద్రప్రసాద్‌గారితో నాకు అహనా పెళ్ళంట, లేడీస్ టైలర్ ఇలా చాలా సినిమాలకు నేను పని చేశాను. ఆయన ఒకానొక సమయంలో నాతో జనా నేను 30 ఏళ్ళుగా పని చేస్తున్నాం చేస్తూనే ఉంటాం అన్నారు. ఆయనకు ఇంకా ఎన్నోఅవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ మాట్లాడుతూ… రాజేంద్రప్రసాద్‌గారికి ఇంత పెద్ద అవార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో 2004లో ఇద్దరం ఒకేసారి అవార్డు తీసుకున్నాం. రాజేంద్రప్రసాద్‌గారికి మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఇది కలా నిజమా… నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది. కలా నిజమా 48ఏళ్ళ సినీ జీవితంలో ఒక కళా కారుడుగా నేను సినిమాల్లో యాక్ట్ చేసినప్పటి నుంచి నా బిహేవియర్‌లో ఎలాంటి మార్పు లేదు. మన జర్నలిస్టులో ఎవ్వరు ఎప్పుడు ఈ ఫిల్డ్ లోకి వచ్చినా మనమందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం కలిసే భోజనం చేశాం. కలిసే మాట్లాడుకున్నాం. కలిసే ఉన్నాం. నేను ఒక నటుడ్ని అని నేను ఎప్పుడూ గర్వం చూపించలేదు. మనం ఒక ఫ్యామిలీ మెంబర్. నాకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని అడ్డంగా వాడేశాను ప్రభుని నాకు కొంచం సహాయం చేయాలి అన్నాను. ఆ నలుగురు సినిమా విడుదల సమయంలో తనతో చిన్న ప్రెస్‌మీట్ లాగా పెట్టి ఈ సినిమా తీసేయడానికి కారణం ఏమిటో నాకు తెలియదు. ప్రభు నీ సినిమాకి ఎందుకు వస్తారు. మా టెన్షన్ అంతా పోతుంది. నువ్వేంటి థియేటర్ బయట ఇలా నిలబడి వున్నాం ఏంటి. నీ సినిమా అంత సీరియస్‌గా ఉంటే ఎవరు చూస్తారు అని ప్రభు అన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి వస్తాం. మరి అలాంటిది ఈ సినిమా ఎలా చూస్తాం. అన్నారు. ఏ మనిషి అయినా చచ్చిపోయాక ఎలా తెలుస్తుంది. పిచ్చోడా ఈ సినిమా చచ్చిపోవడంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా అంతా అప్పుడే జోకులు స్టార్ట్ అవుతాయి అన్నాను. అవునా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ… నేను నా స్నేహితులతో కలిసి చూస్తాను అన్నాడు. చూశాడు. ఏమి చేశాడో తెలియదు. ఏ థియేటర్‌లో తీసేశారో అదే థియేటర్‌లో 100 రోజులు ఆ సినిమా ఆడింది. ఆ నలుగురు ఎంత ఫన్ చేశావు అన్నయ్య అన్నారు. నేను రామారావుగారి ఇంట్లో పుట్టినా. మా నాన్నగారు నిమ్మకూరులో మాస్టారు. నాకు ఇప్పటివరకు కాంట్రవర్సీలు లేవు. హాలీవుడ్ లో పని చేసేవారిని ఎవరినైనా కూర్చోబెట్టి ఉదయం లేడీస్ టైలర్. మధ్యాహ్నంఅహనా పెళ్ళంటా సినిమాల వెయ్యండి. వాడెవరు వీడెవరు అనకపోతే నా పేరు మార్చుకుంటా. యాక్టర్‌గా అలాంటి అవకాశాలు రాకపోతే నాకు ఇంత మంది అభిమానులు ఉండరు. కోడిని కట్టేసి కోడి కూర తింటారా. హాట్సాఫ్ టు జంధ్యాల గారు. వారందరూ లేనిదే నేను ఎక్కడ ఉన్నా. అంతమంచి రచయితల వల్లే నేను ఇలా ఉన్నాను. వారు రాసారు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను. నిజమే పద్మశ్రీరావడం ఆలస్యం అయింది. ప్రతి తెలుగు వారి ఇంట్లోను రాజేంద్రస్రసాద్ ఉన్నారు. నాకు ఇప్పుడు తయారవుతున్న దర్శకులందరూ నేను ఐదు జనరేషన్లు దాటి వచ్చాను. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్‌బాబు, మహేష్‌బాబు, అల్లుఅర్జున్ ఇప్పుడు జనరేషన్ వరకు అందరికి పరిచయం అందరికీ పరిచయం ఉన్నాను. అదే స్వామి మనకి ఇచ్చేటటువంటి దేవుడు ఇచ్చిన ప్రసాదం. నాకోసం ఇప్పుడున్న దర్శకులు నా మీద ఉన్న బాధ్యతతో మంచి మంచి క్యారెక్టర్లు రాస్తారు. ఎక్కడా రిలాక్స్ అయ్యే మనస్తత్వం కాదు నాది. జర్నలిస్టులు ఒక ఆర్టిస్టు గురించి మాట్లాడటం చాలా ఆనందం. మీ ఫ్యామిలీ మెంబర్‌గా మీలో ఒకడిగా నేను చనిపోయేంతవరకు ఇలానే ఉంటాను. ఫిలిం క్రిటిక్స్ నా సొంత మనుషులతో సమానం. ఈ సన్మానం నాకు మంచి బూస్ట్ అప్ ఇచ్చారు అన్నారు.

