*తెలంగాణ ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్*

*తెలంగాణ ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్*

-*డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ*

బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు తెలంగాణ ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఈ చిత్ర ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

తెలంగాణ ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ – బహుజనుల రాజ్యం నెలకొల్పాలి, మన రాజ్యం మనమే పరిపాలించుకోవాలని పోరాటం సాగించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన కోటలను జయిస్తూ గోల్కొండ కోటదాకా వెళ్లిన ఆయన పోరాటం ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాంటి ధీరుడి చరిత్రతో వెంకటేష్ గౌడ్ సినిమా రూపొందించడం, ఆ సినిమాను రామకృష్ణ గౌడ్ గారు రిలీజ్ చేస్తుండటం సంతోషకరం. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పుస్తకరూపంలోనూ వెంకటేష్ గౌడ్ తీసుకొస్తుండటం అభినందనీయం. ఈ విధంగా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వాయి పాపన్న చరిత్ర భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి. బహుజనులను ఏకం చేయడానికి సాధనంగా నిలవాలని కోరుకుంటున్నా. ఈ నెల 18న ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరిస్తున్నాం అన్నారు.

డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్ ను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను మా ఆర్కే ఫిలింస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 21న సర్వాయి పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న విగ్రహం పెట్టబోతుండటం కూడా ఆనందంగా ఉంది.మంత్రిర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందుకు ఇనిషేటివ్ తీసుకున్నారు. వారి హుస్నాబాద్ ప్రాంతానికి కూడా సర్వాయి పాపన్న గారి పోరాటంతో సంబంధం ఉంది. బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం అద్వితీయం. ఆ పోరాటానికి అద్దం పట్టే ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.

దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ – అప్పటి ఔరంగాజేబ్ పాలనలో ఈ దక్కన్ ప్రాంతంలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు అధిక పన్ను వసూల్లతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టేవారు. అలాంటి దోపిడీని ఎదురించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. అణగారిన వర్గాల నుంచి పుట్టిన ఈ ధీరుడు ఔరంగాజేబ్ పాలకులకు, నిజాం నవాబులకు ఎదురొడ్డి నిలిచి 30 ఏళ్లు స్వతంత్ర రాజుగా ప్రజాపాలన సాగించాడు. ఢిల్లీకే సవాల్ విసిరాడు. గోల్కొండను ఏడు నెలలు పరిపాలించి, వాళ్ల కుయుక్తులకు ఆత్మబలిదానం చేసుకున్నట్లు చరిత్ర వెల్లడిస్తోంది. ఈ వీరుడి చరిత్రను మా వీజీ మూవీ మేకర్ బ్యానర్ పై నా స్వీయ దర్శకత్వంలో రూపొందించాను. మా సినిమాను డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు తన ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ నెల 21న తప్పకుండా థియేటర్స్ లో చూడండి అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ మాట్లాడుతూ – సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల కోసం పోరాడిన వీరుడు. ఆయన జీవిత చరిత్రతో సినిమా రూపొందడం సంతోషంగా ఉంది. ఆర్కే ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదల చేయబోతున్నాం అన్నారు.

నిర్మాణ పర్యవేక్షకులు దీపక్ న్యాతి మాట్లాడుతూ – పాలకులు చేస్తున్న దోపిడీని అడ్డుకుని ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి. బహుజనులను ఏకం చేసి తిరుగుబాటు సాగించాడు. ప్రజలకు పన్నుల భారం లేకుండా చేశాడు.ఆ ధీరుడిని చరిత్రను ఎంతో శ్రమకోర్చి మా వెంకటేష్ గౌడ్ తెరకెక్కించారు అన్నారు.

టెక్నీషియన్స్
———————–
వీఎఫ్ఎక్స్, సూపర్ విజన్ – పి. శ్రీనివాస్
ఎడిటర్ – సతీష్ పెటేటి, మణి
సినిమాటోగ్రఫీ, విజువల్ డైరెక్షన్ – మిర్జాపురి సైమన్
లీడ్ ఏఐ విజువల్ డైరెక్టర్ – సురేష్ మల్ల
మ్యూజిక్ సూపర్ వైజర్, లిరిక్స్ – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
బ్యానర్ – వి.జి. మూవీ మేకర్స్
నిర్మాత, దర్శకత్వం – వెంకటేష్ గౌడ్ లింగంపల్లి
రిలీజ్ – ఆర్ కే ఫిలింస్ (డా.ప్రతాని రామకృష్ణ గౌడ్)
పీఆర్ఓ – చందు రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *