న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి సందడి!

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో
తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి సందడి!

కలలు, పట్టుదల, భారతీయ స్ఫూర్తికి ప్రతీకగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తెలుగు మూలాలున్న రాజ్ దాసిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2025లో 97వ ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందుకుని అంతర్జాతీయ మీడియా, అభిమానుల దృష్టిని ఆకర్షించిన రాజ్ దాసిరెడ్డి… తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో హైప్రొఫైల్‌ ప్రదర్శనతో మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగుతున్న ఆయన ప్రయాణం సోషల్ మీడియాలోనూ విశేష చర్చకు దారితీస్తోంది.

అమెరికాలో విద్యాభ్యాసం చేయడంతోపాటు… అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకుని, మోడలింగ్ నుంచి నటనలోకి ప్రవేశించి, మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన “భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు” చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి నటిస్తున్న ఓ బహుభాషా చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *