జూలై 3 న ‘భానుమతి రామకృష్ణ’ వరల్డ్ ప్రీమియర్

జూలై 3 న ‘భానుమతి రామకృష్ణ’ వరల్డ్ ప్రీమియర్
ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది.

భిన్న మనస్తత్వాలు కలిగి, ముప్పయేళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా , రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథనంతో సాగే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు చూపించిన అద్భుతమైన విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ,ప్రముఖ యువ దర్శకుడు రవికాంత్ పెరెపు ఎడిట్ చేశారు.

ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ‘భానుమతి రామకృష్ణ’ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడుతూ – “చాలా కాలం తరువాత ఒక అందమైన ప్రేమకథను చూస్తున్నట్లు అనిపించింది. 30 ఏళ్ళ వయసులో ఉన్న పరిణితి చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమ కథను చూడటం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలు మనం తరచుగా చూడనిది. మొదటిసారిగా ఈ చిత్రం ఆహలో విడుదల అవుతుందని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

యశ్వంత్ ములుకుట్లకు చెందిన క్రిషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కు చెందిన శరత్ మరార్ సమర్పించారు