కేజీఎఫ్2 షూట్ లో ‘ప్రకాశ్ రాజ్’

కేజీఎఫ్2 షూట్ లో ‘ప్రకాశ్ రాజ్’

కేజీఎఫ్2 చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. బెంగళూరులో వేసిన సినిమా సెట్స్ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ షూట్ లో భాగంగా ప్ర‌కాశ్ రాజ్ పై వ‌చ్చే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. లొకేష‌న్ లో ప్ర‌శాంత్ నీల్.. ప్ర‌కాశ్ రాజ్ కు సీన్ వివ‌రిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. క్యాన్స‌‌ర్ చికిత్స కోసం సంజ‌య్ ద‌త్ యూఎస్ఏకు వెళ్లొచ్చిన త‌ర్వాత క్లైమాక్స్ సీన్ల‌ను షూట్ చేయ‌నుంది చిత్ర‌యూనిట్‌. సంజయ్‌ దత్‌ స్టేజ్‌-03 లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడినట్టు వైద్యులు నిర్దారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స కోసం యూఎస్‌కు వెళ్లారు సంజయ్‌దత్‌. సంజ‌య్ ద‌త్ త్వ‌ర‌గా కోలుకుని మ‌ళ్లీ ఆరోగ్యంగా షూటింగ్ లో పాల్గొనాల‌ని అభిమానులు, చిత్ర‌బృందం ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *