శివనాగు నర్రా దర్శకత్వంలో హీరో సుమంత్?

శివనాగు నర్రా దర్శకత్వంలో హీరో సుమంత్?

“దేవినేని” చిత్రంతో  సంచలనం సృష్టించిన శివనాగు నర్రా తన తదుపరి చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. తాను దర్శకత్వం వహించబోతున్న తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ తో పాటు, షూటింగ్ లోకేషన్ల కోసం  గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలోని పలు ప్రాంతాల లొకేషన్స్ ని పరిశీలిస్తున్నారు డైరెక్టర్ నర్రా శివనాగు.     ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అయితే తన తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.  తెలుగు సినీ పరిశ్రమలో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్ గతంలో ఎన్నో సూపర్ హిట్స్ సాధించారు. హీరో సుమంత్ సరసన ఓ ప్రముఖ కథానాయిక జత కుడుతోందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *