పోస్ట్ ప్రొడక్షన్ లో హారర్ కామెడీ “అపరిచిత దారి”
*పోస్ట్ ప్రొడక్షన్ లో హారర్ కామెడీ “అపరిచిత దారి” !!!*
*అపరిచిత దారి… త్వరలో థియేటర్స్ లో…*
*రహదారుల్లో జరిగే ప్రమాదాల నేపథ్యంలో “అపరిచిత దారి !!!*
పరం జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.
నిర్మాతలు బోయపల్లి సత్తయ్య, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ తెలుగు తో పాటు కన్నడ లో ఒకసారి విడుదల కానుంది. రహదారులలో లో రాత్రులు జరిగే ప్రమాదాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.
హర్రర్ కామిడి జానర్ లో రాబోతున్న అపరిచిత దారి చిత్రం బెంగళూరు , హైదరాబాద్ లో షూట్ చేశారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కానున్నాయి. బాలా గణేశన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్.వి సంగీతం అందిస్తున్నారు.
నటీనటులు: తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్, పద్మనాభ రెడ్డి, హేమంత్, సిరి, రజత్, కీర్తి, మను, ఉమేష్, సింహాద్రి, శుభ రక్ష, స్వామి తదితరులు… నిర్మాతలు: బోయపల్లి సత్తయ్య, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్, లైన్ ప్రొడ్యూసర్స్: ఆనంద్, పద్మనాభ రెడ్డి, దర్శకత్వం: రవి బాసర, సంగీతం: ఎస్.ఎస్.వి, కెమెరామెన్: బాల గణేషన్, ఎడిటర్: ఆలోసిస్,ఆర్ట్: రవీందర్ సిరి, కథ: లక్కి పూరి