42ఏళ్లకి తల్లైన నటి సంఘవి

స్టార్ హీరోల అందరితో నటించింది నటి సంఘవి. ఈ అమ్మడు 39 ఏళ్ళ వయసులో 2016లో వెంకటేశ్ అనే ఐటీ సంస్థ యజమానిని సంఘవి వివాహం చేసుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోకి కొన్ని ఎపిసోడ్స్ కి జడ్జ్ గా వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి 42 ఏళ్ళు కాగా, ఇటీవలే ఓ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తాజాగా సంఘవి తన కూతురితో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ‘అమరావతి’ అనే తమిళ సినిమాలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ సంఘవి. అసలు పేరు కావ్య. ఈమె తెలుగులో శ్రీకాంత్ హీరోగా ‘తాజ్ మహల్’ సినిమాతో అరంగేట్రం చేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం చిత్రం సంఘవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 15 ఏళ్లకు పైగా ఉన్న తన సినీ కెరీర్ లో సౌత్ ఇండియాలోని తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి అలరించింది. టాలీవుడ్ లో నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, ఎన్టీఆర్, రాజశేఖర్ ,శ్రీకాంత్ వంటి హీరోల సరసన నటించి తెలుగమ్మాయిలా గుర్తింపు తెచ్చుకుంది.