తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ

తెలంగాణా  ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్మికులు పనులు లేక నిత్యవసరాల కు  ఇబ్బందులు పడుతున్న క్రమంలో తెలంగాణా ఫిల్మ్  ఛాంబర్ లోని 24క్రాఫ్ట్ సభ్యులకు  ఈ రోజు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ లో నిత్యావసర వస్తువులు అందించారు.ఈ సందర్భంగా డా.ప్రతాని రామ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ….”ఈ రోజు  తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని సభ్యులకు కొంత మంది నటీ నటులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లకు , మెక్ అప్ వారికి, కెమెరా అసిస్టెంట్స్ ఇలా దాదాపు 50 మందికి  నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. మిగతా సభ్యులకు కూడా త్వరలో పంపిణీ చేస్తాం . ఇలా మా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులందరికీ సాయపడనున్నాం. అందరూ ఇంట్లో ఉంటూ, గంట గంటకు చేతులు కడుక్కుని ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని” అన్నారు.