*హలో బేబీ కి పురస్కార్ నంది అవార్డు*

*హలో బేబీ కి పురస్కార్ నంది అవార్డు*
హైదరాబాద్లో లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకలో ” హలో బేబీ” చిత్రంలో నటించిన *కావ్య కీర్తి* కి పురస్కార్ నంది అవార్డు దక్కింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో తీయబడిన హలో బేబీ చిత్రంలో అద్భుతమైనటువంటి నటనకు గాను ఈ పురస్కార్ నంది అవార్డు దక్కిందని దీనికి మా టీం సపోర్ట్ చాలా ఉన్నదని కావ్య కీర్తి చెప్పుకొచ్చారు.
సోలో క్యారెక్టర్ తో సినిమా చేయడం అనేది చాలా సహజకరమైనటువంటి విషయం. ఈ కథని రాస్తున్నప్పుడే కచ్చితంగా మంచి అవార్డ్స్ వస్తాయని నమ్మాను. అందుకనే ఈ సినిమా తీయడానికి శ్రీకారం చుట్టాను అని ప్రొడ్యూసర్ *ఆదినారాయణ కాండ్రేగుల* అన్నారు.
మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ, హీరోయిన్ శ్రీవాణి, హీరో కార్తికేయ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *