“దేవినేని” టీజర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత

 

డైనమిక్ డైరెక్టర్ నర్రా శివనాగు దర్శకత్వం వహించిన చిత్రం “దేవినేని” (బెజవాడ సింహం – ట్యాగ్ లైన్).

గతంలో బెజవాడ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలకు భిన్నంగా బెజవాడలో చలసాని, వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల జీవితాలలో జరిగిన వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా దర్శకుడు నర్రా శివనాగు చిత్రీకరించాడనీ, ఈ మూవీ విడుదల తర్వాత దేవినేని వంగవీటి వర్గాల్లో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందోననీ ఫిలిమ్ నగర్ వర్గాలు, ప్రివ్యూ షో చూసిన సినిమా పెద్దలు భయపడుతున్నట్టుగా సినీ జర్నలిస్టులు చెబుతున్నారు.

ఈ చిత్రం టీజర్ ని హీరో శ్రీకాంత్ లాంచ్ చేస్తూ “టీజర్ చాలా బాగుంది. మిత్రుడు శివనాగు మేకింగ్ చాలా డైనమిక్ గా ఉంది. శివనాగు మంచి దర్శకుడు. శివనాగు నేను కలసి గతంలో మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యాము. శివనాగుకి “దేవినేని” మూవీ పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద కమర్షియల్ సినిమా అవుతుంది. తమ్ముడు నందమూరి తారక్ లుక్ అదిరింది. తారక్ కి కూడా ఈ చిత్రంతో స్టార్ డమ్ వస్తుందని, శివనాగు స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ టీజర్ చూడగానే నాకు అర్ధమయింది” అన్నారు శ్రీకాంత్. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి వినాయకరావు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *