హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన ‘నాగ శౌర్య ‘వరుడు కావలెను‘ 

హైదరాబాద్ లో నేడు పునః ప్రారంభమైన ‘నాగ శౌర్య ‘వరుడు కావలెను‘ 

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘
చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. చిత్ర నాయకా, నాయికలు
‘నాగ శౌర్య ,రీతువర్మ’ లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ గీతం తో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
 ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్     సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *