సంహారి’ మూవీ రివ్యూ..

సంహారి’ మూవీ రివ్యూ.

తారాగణం :రవికుమార్ రానా (రుధీర్ ), నేహా (షాలిని)బ్రహ్మ నంద రెడ్డి (మాస్టర్ ) చిట్టిబాబు (అభి), మల్లికార్జున్ (చంద్ర ), రాంబాబు (జయరాం )అశోక్ (కన్నా ), ఆంజనేయులు (మున్నా ) ప్రొడ్యూసర్, కథ, డైరెక్టర్ :రవికుమార్ రానా. మ్యూజిక్ :రాజ్ కిరణ్, ఎడిటర్ :వంశీ పెళ్లూరి, డి ఓ పి :అనుబాబు, జి కే నాయుడు, వెంకట్, లిరిక్స్ :మత్తుమురు రామారావు, కొరియోగ్రఫీ :ఉమా శంకర్, మనూజ, ఫైట్స్ :అశోక్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ :లోకేష్ తాత

కథ : ఇద్దరు మహిళలు గుడిలో పూజ ముగించుకొని వస్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు ఆ మహిళలను చంపి నగలు దోచుకొని వెళ్తారు, అలాగే ఒక ఇంటికి పెద్ద మనిషి ఇంటికి  వెళ్లి ఆ పెద్ద మనిషి ఇద్దరు కూతుర్లను వ్యామోహం తో వాళ్ళ కోరిక తీర్చుకొని ఆ పెద్దాయన ని కి ఇద్దరు కూతుర్లను దూరం చేస్తారు, రుధీర్ అనే మన హీరో ఫ్రెండ్స్ తో హ్యాపీ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కష్టాల్లో వున్నా వారికి తన వంతు సాయం చేస్తూ తన తండ్రి గారాల కొడుకు గా జీవితాన్నిసరదాగా గడుపుతూ ఉంటాడు, ఆలా హ్యాపీ గా సాగె తన జీవితం లోకి షాలిని ఎలా వచ్చింది అలాగే హీరోకి రేచీకటి ఉండటం వలన కథ ఎటు మలుపు తిరుగుతుంది మరియు సినిమా మొదటి భాగం లో జరిగే హత్యలు చేసిన గ్యాంగ్ ని హీరో ఎలా హత మార్చాడు అనేది థియేటర్ కి వెళ్లి చూడవలసిందే.

విశ్లేషణ :   జాలీగా లైఫ్   ఎంజాయ్ చేస్తూ  తిరిగే హీరో రవికుమార్ రానా రుధీర్ అనే పాత్ర , తను తప్ప ఈ పాత్రకి ఇంకొకరు ఉహించుకోలేము అన్న విదంగా పాత్ర లో ఒదిగి పోయాడు, హీరోయిన్ నేహా హీరో రానా మధ్యలో వచ్చే లవ్ కెమిస్ట్రీ బాగా వర్క్ఆవుట్ అయ్యింది అలాగే సినిమా లో హత్యలు చేసే గ్యాంగ్ కూడా కథ కి ప్రధాన బలం, హీరో ఫ్రెండ్స్ కూడా బాగా చేశారు అని చెప్పాలి, సినిమా పాటలు కూడా ఆణిముత్యాలు గా కుదిరాయి, రాజ్ కిరణ్ అందించిన మ్యూజిక్ కూడా సినిమా విజయం లో కీలక పాత్ర  పోషించింది  అని చెప్పాలి, కెమెరా పనితనం బాగుంది.  రవికుమార్ రానా హీరో గా, కధారచయిత గా, ప్రొడ్యూసర్ గా,  దర్శకుడు గా ఎన్ని భాద్యతలు   మొయ్యటం చాలా సాహసం అని చెప్పాలి, అలాగే సినిమా ఖర్చు విషయం లో కూడా రవికుమార్ రానా ఎక్కడ రాజి పడలేదు అని చెప్పాలి అందుకే  సినిమా క్వాలిటీగా, రిచ్ గా  ఇంత బాగా వచ్చింది అని చెప్పాలి, సినిమా లో ఫైట్స్ కూడా చాలా బావున్నాయి అని చెప్పాలి, చివరి గా రవికుమార్ రానా వెండి తెర మీద సంహారి గా విజృంభిచ్చారు. తెలుగు తెరకు మరో ఆణిముత్యం దొరికిందనే చెప్పాలి. రవి కుమార్ నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ యువ నటుడికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి.

రేటింగ్;  3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *