King Nagarjuna’s Special Birthday Poster The Ghost is out

 

King Nagarjuna’s Special Birthday Poster From Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost is out

King Akkineni Nagarjuna’s highly anticipated film The Ghost under the direction of Praveen Sattaru is carrying exceptional buzz with Tamahagane followed by theatrical trailer receiving overwhelming response. Clocked 9 Million views, the trailer that got over 200K likes is still trending on YouTube.

Today, wishing Nagarjuna on his birthday, the makers released a new poster. Holding Tamahagane in his hand, Nagarjuna can be seen sitting on a chair and giving stern gaze. This indeed is a perfect poster on the occasion from the film which is billed to be an action thriller with a novel concept.

As is known, Tamahagane is Nagarjuna’s weapon in the movie and the glimpse about the same too got exceptional response. Sonal Chauhan played the leading lady opposite Nagarjuna in the movie and both will appear as Interpol officers. The film also features Gul Panag and Anikha Surendran in vital roles.

With blessings of Narayan Das Narang, Suniel Narang, in association with Puskur Ram Mohan Rao, and Sharrath Marar is producing The Ghost on lavish budget under Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.

Mark K Robin is the music director, while songs are provided by Bharath and Saurab duo. Mukesh G handled the cinematography, while Brahma Kadali is the art director and Dinesh Subbarayan and Kaecha choreographed the stunts.

The Ghost’s hunt will begin in cinemas from October 5th (Dasara release).

Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.

Technical Crew:
Director: Praveen Sattaru
Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar
Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment
Cinematography: Mukesh G.
Music: Mark K Robin (Songs by Bharath and Saurab)
Action: Dinesh Subbarayan, Kaecha
Art Director: Brahma Kadali
Executive Producers: Mohan and Venkateswara Rao Challagulla
PRO: Vamsi-Shekar, BA Raju

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ది ఘోస్ట్’ నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 200K పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.

ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది.

ఈ చిత్రంలో తమహగనే అనేది నాగార్జున ఆయుధం. తమహగనే గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్  వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. నాగార్జున, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్ , అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ,  భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా,  బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *