మెరుపు తీగలా వాణీ విశ్వనాథ్

మెరుపు తీగలా వాణీ విశ్వనాథ్

గ్లామరస్ అండ్ ఎవర్ గ్రీన్ స్టార్ వాణీ విశ్వనాథ్ తో సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో దర్శకుడు నర్రా శివనాగు కొంతమంది రైటర్స్ తో కలసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారట.

ఒకప్పుడు తెలుగు,తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోలతో నటించి, తరువాత లేడీ ఓరియెంటెడ్, యాక్షన్ ఎడ్వంచర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను స్వంతం చేసుకొని ట్రేడ్ మార్కెట్ లో బిజినెస్ పరంగా పెద్ద హీరోలకు సైతం పోటీగా నిలిచిన ఎవర్ గ్రీన్ స్టార్ వాణీ విశ్వనాథ్ మళ్ళీ చాలాకాలం తర్వాత తెలుగు లో రీ-ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే కొత్తరకం కాన్సెప్ట్ కోసం చాలాకాలంగా వెయిట్ చేస్తున్న ఈ కలల రాణీ, వాణీ విశ్వనాథ్ కి దర్శకుడు నర్రా శివనాగు చెప్పిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ కథ నచ్చడం తో ఆయన తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినదట.

ప్రస్తుతం వాణీ విశ్వనాథ్ తమిళ్ లో “”క్రిమినల్ లాయర్”” అనే సినిమా షూటింగ్ లో ఉన్నదట. అలాగే నర్రా శివనాగు దర్శకత్వం వహించిన “”నటరత్నాలు”” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది..
ప్రస్తుతం జరుగుతున్న ఈ చిత్రాల విడుదల తరువాత
వాణీ విశ్వనాథ్ -శివనాగు ల కాంబినేషన్ లో ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
అయితే శివనాగు చెప్పిన కాన్సెప్ట్ లో హీరోయిన్ మెరుపు తీగలా నాజూగ్గా సన్నగా ఉండాలంట. అందుకు వాణీ విశ్వనాథ్ జిమ్ లో రోజుకు రెండు గంటల సేపు స్పెషల్ కోచ్ పర్యవేక్షణలో వర్క్ అవుట్ చేస్తుందట. ఈ సాధన వలన ఆమె బరువు తగ్గి 55 కిలోలకు వచ్చినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *