*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వైజాగ్ ఆర్టిస్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ కు స్థానం*

*తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వైజాగ్ ఆర్టిస్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ కు స్థానం*

జ్ఞానాపురం జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్లే గ్రౌండ్ వేదికగా 2023 మార్చ్ 10,11,12, తేదీలలో మూడు రోజులుగా జరిగిన వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి కార్యక్రమం నిన్న సాయింత్రం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగగా పాడుతా తీయగా ఫేమ్ సింగర్స్ సార్థక్ , అమిత, అన్విత్, గాయత్రీ దేవి , హార్షిణి, ధీరజ్ లు తమ పాటలతో ప్రేక్షకులను అలరించగా , నృత్య భారతి డాన్స్ అకాడమీ చిన్నారులు సాంప్రదాయ నృత్యాలు , కుమారి సాత్విక కూచిపూడి నృత్యంతో ఆకట్టుకోగా , ఉత్సవానికి సెంచూరియన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ , డా.GSN.రాజు గారు ముఖ్యఅతిధిగా హాజరై విజేతలైన ఫ్రెండ్షిప్ కప్ విన్నర్స్ డాల్ఫిన్ డాన్స్ టీమ్ కు మరియు రన్నరప్ టీమ్ రెడ్ హిల్స్ సభ్యులకు , మహిళల టీమ్ విన్నర్స్, రన్నర్స్ కు టోర్నమెంట్ ఫ్రెండ్షిప్ కప్ లను అందించిన ఆనంతరం మాట్లాడుతూ నిత్యం సాంస్కతిక కార్యక్రమాలతో బిజీగా ఉండే కళాకారులకు ఈ టోర్నమెంట్ ఎంతో ఉల్లాసాన్ని , ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా వారిలో వారికి సహాయం చేసుకోడం, వృత్తిలో అభివృద్ధికి అవసరమైన బంధాన్ని ఇస్తుందని చెబుతూ విజేతలకు శుభాకాంక్షలు చెప్పారు.

అలాగే టోర్నమెంట్ నిర్వాహకులు అయిన సథ్గీత్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాథోగణేష్ కు మరియొక నిర్వాహకుడు చిత్ర దర్శకుడు, శ్రీవిష్ణు స్కూల్ డైరెక్టర్ రెడ్డెం యాదకుమార్ కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరణ పత్రాలు ను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ డిస్ట్రిక్ట్ ఇంఛార్జి అయిన వేముల భాస్కరాచారి అతిథుల సమక్షంలో అందించి అభినందించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన పైడా విద్యాసంస్థలు అధినేత శ్రీ పైడా కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ కళా కారులు అందరితో 4 సంవత్సరాలుగా క్రికెట్ మ్యాచేస్ నిర్వహించి రాష్ట్రానికి గర్వకారణంగా నిర్వాహకులు నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యంతం వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన లిమ్కా రికార్డు గ్రహీత వేముల భాస్కరాచారి , ప్రఖ్యాత గాయకుడు రమేష్ కుమార్ పట్నాయక్ , కుమారి జోషితలు వ్యవహరించగా కార్యక్రమానికి గౌరవ అతిథిలుగా విచ్చేసిన స్టీల్ ప్లాంట్ జి.ఎం. డా.వి.చిట్టిబాబు ,వరుణ్ మెడికల్స్ అధినేత వరుణ్ ప్రసాద్, మాజీ అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ మొహ్మద్ ఖాన్ , విశాఖ కళాకారుల సంఘం అధ్యక్షుడు క్యాలు జనార్దన్, మను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి మను పల్లా , సంఘ సేవకురాలు శ్రీమతి విజయ లక్ష్మి , నాంచారయ్య లను ఆహ్వానించి గౌరవించారు.

ఇంకా నగరానికి చెందిన కళాసంస్థల అధిపతులు బాదంగీర్ సాయి, జగత్ రావు,ఏ. ఎమ్.ప్రసాద్, ధనుంజయ్,కోరుకొండ రంగారావు, జి.వి.త్రినాథ్ , ఫణి స్వామి, పైడి శంకర్ రావు, శివజ్యోతి, హేమ,రమా మరియు అధిక సంఖ్యలో నగరానికి చెందిన సినీ,టీ.వి,రంగస్థల కళాకారులు హాజరై తమ విన్యాసాలతో పాటలతో,డాన్స్ లతో వు ఆహూతులకు ఆనందాన్ని ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్వాహకులు తమకు సహకరించిన భూమాత రియల్ ఎస్టేట్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ శంకర్ రావు గార్కి , బెహరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ డా.బెహరా విజయ చైతన్య, శ్రుతి ఫౌండేషన్ నారాయణ రావు ,మొల్లి శేఖర్ , కీరవాణి ఆర్కెస్ట్రా మనోహర్ ప్రసాద్ అండ్ టీమ్ సభ్యులుకు , ప్రతీఒక్కరకీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *