Social thinking at an early age is commendable – Film actress Manchu Lakshmi

చిన్న వయసులోనే సామాజిక ఆలోచన రావడం అభినందనీయం – సినీ నటి మంచు లక్ష్మి

ఫొటో… ఐక్యం వీడియో పాటను ఆవిష్కరిస్తున సినీ నటులు మంచు లక్ష్మి ప్రాచీన ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు అయిగిరి నందిని పాట మీద కూచిపూడి ప్రదర్శనతో వీడియో చేశామని మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ మనవరాలు మయూక తెలిపారు. కూచిపూడి నృత్యంతో ఆమె ఐక్యంతో పేరుతో నర్తించిన వీడియోను ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి, సినీ హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్‌ సీరత్‌ కపూర్, నిర్మాత స్వప్న దత్‌లో బుధవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మయూక మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నానని ఎంతో ఇష్టంతో ఈ వీడియో చేశామని తెలిపారు. తెలంగాణలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయని వాటిన్నింటిని భరతనాట్యం, కూచిపూడి వంటి కళలతో అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ తరహా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా ప్రాచీన ఆలయాలను వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయేందర్‌గౌడ్, శ్వేత, వీరేందర్, వినయేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *