ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ‘రౌద్ర రూపాయ’

ఈమధ్య సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ బాక్సాఫీస్ వద్ద బాగా పర్ ఫాం చేస్తున్నాయి. బలమైన ప్లాట్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను తీస్తే చాలు ఆడియెన్స్ బాగా ఎంగేజ్ అవుతారు. అందుకే కొత్త దర్శకులు, నిర్మాతలు వెండితెరపై రాణించాలని ఇలాంటి కథలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా కాలకేయ ప్రభాకర్, మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 12న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాకు జాన్ భూషణ్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురుచేసిందో చూద్దాం పదండి.

కథ: ఆద్య(మోహన సిద్ది)కు తన జాబ్ గోవాకు ట్రాన్ఫర్ అవ్వడంతో తన చెల్లి(పాయల్ ముఖర్జీ)తో కలిసి గోవాకు వెళ్తుంది. అక్కడ ఆఫీస్ క్వార్టర్స్ ఇంకా రెడీ అవ్వకపోవడంతో ఆఫీస్ కి సంబంధించిన గెస్ట్ హౌస్ మోజా విల్లాలో ఉంటారు. వేళ్ళ విల్లా పక్కనే ఇంకో వీళ్ళలో మాజీ ఆర్మీ మేజర్(కాలకేయ ప్రభాకర్)ఉంటాడు. అతనికి ఉన్న ఓ సమస్యతో ఆవేశంతో ఎదురుగా ఎవరైనా గొడవ పెట్టుకున్నా, ఎక్కువ మాట్లాడినా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఆద్య చెల్లి లవర్ జై గోవాకు వచ్చి తన లవర్ ని కలిసి వెళ్లేముందు పక్క వీళ్ళలో ఏదో జరుగుతుందనిపించి వీడియో తెస్తాడు. అక్కడ మేజర్ తన భార్యని చంపేస్తూ ఉంటాడు. జైని చూసి అతన్ని కొట్టి పడేస్తాడు. జై కోసం వెతుక్కుంటూ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మేజర్ ఇంట్లోకి వెళ్తే అతని అసలు రూపం తెలుస్తుంది. అసలు మేజర్ అందర్నీ ఎందుకు చంపుతున్నాడు? అతనికి ఉన్న సమస్య ఏంటి? అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మేజర్ దగ్గర్నుంచి ఎలా బయటపడ్డారు? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలు ఇటీవల మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ రౌద్ర రూపాయ నమః సినిమా కుడా అదే జానర్ లో వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో అక్క చెలెళ్ల గురించి చూపించి గోవాకు రావడం, వీల్లలోకి వెళ్లడం, అక్క చెల్లెళ్ళ ప్రేమ కథలు, మేజర్ పాత్ర గురించి చూపించి అక్క చెల్లెల్లు మేజర్ ఇంట్లో చిక్కుకుపోవడంతో ఇంట్రెస్ట్ గా ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి కలిగిస్తారు. ఎక్కువ షూటింగ్ ఒకే లొకేషన్ లో తీసినా అక్కడే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠని క్రియేట్ చేయడం విశేషం.

కాలకేయ ప్రభాకర్ ఆల్రెడీ తన విలనిజంతో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా తన నెగిటివిటితో మెప్పిస్తాడు. అక్కచెల్లెళ్లుగా నటించిన మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ భయపడుతున్న అమ్మాయిలుగా నటనతో మెప్పిస్తునే తమ అందాలతో కూడా అలరిస్తారు.

దర్శకుడు ఎంచుకున్న కథ, కథనాలు చాలా ఎంగెజింగ్ గా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ను అలరించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ సస్పెన్స్ సీన్స్ లో బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డైలాగ్స్ కి డామినేట్ గా అనిపిస్తుంది. సింపుల్ కథని తీసుకొని కథనం కొత్తగా ట్రై చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *