మెర్సీ కిల్లింగ్ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది : దర్శకుడు వెంకటరమణ ఎస్

మెర్సీ కిల్లింగ్ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది : దర్శకుడు వెంకటరమణ ఎస్

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా “మెర్సీ కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సబ్యులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఎమోషనల్ కథ కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన మెర్సి కిల్లింగ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీస్ నుండి మాకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని దర్శకులు వెంకటరమణ తెలిపారు.

మా మెర్సీ కిల్లింగ్ సినిమా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. ఏప్రిల్ 12న విడుదలైన మా సినిమాకు అన్ని ఏరియాస్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. రిపోర్ట్స్, రివ్యూస్ చూస్తుంటే సంతోషంగా ఉందని చిత్ర సమర్పకురాలు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి తెలిపారు.

నటీనటులు:
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్
డైరెక్టర్: వెంకటరమణ ఎస్
నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
సమర్పణ: శ్రీమతి వేదుల బాల కామేశ్వరి
సినిమాటోగ్రఫీ: అమర్.జి
సంగీతం: ఎం.ఎల్.రాజ
ఎడిటర్: కపిల్ బల్ల
ఆర్ట్: నాయుడు
మాటలు: వై. సురేష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వి కడియం
లైన్ ప్రొడ్యూసర్: బాబీ శివకోటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *