తమిళుల మనస్సు దోచే  “మధురైసింగం”

తమిళుల మనస్సు దోచే  “మధురైసింగం”* దర్శకుడు నర్రా శివనాగు కు ఉజ్వలభవిష్యత్తు. – సాంగ్ లాంచ్ కార్యక్రమంలో లెజండ్రీ డైరెక్టర్ k.భారతీరాజా ప్రశంశ-
నర్రా శివనాగు దర్శకత్వం వహించిన మధురై ( బెజవాడ) బ్యాగ్రౌండ్ తమిళ చిత్రం *మధురైసింగం*
      ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర తమిళ నిర్మాత దివ్యసుందరవడివేలు మాట్లాడుతూ తెలుగు డైనమిక్ డైరెక్టర్ నర్రాశివనాగు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం చూసి నేను  డబ్బింగ్ హక్కులు కొన్నాను. తమిళ వెర్షన్ పూర్తయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు చేసుకుంటుంది. అయితే తమిళ భీష్మపితామహుడైన, లెజెండరీ డైరెక్టర్ శ్రీ కె.భారతీ రాజా గారు మా చిత్రం ఫస్ట్ సాంగ్ ను లాంచ్ చెయ్యడం  మాకెంతో ఆనందం గా ఉందని నిర్మాత దివ్యాసుందరవడివేలు అన్నారు.
   తమిళ దర్శకులు కె.భారతీరాజా గారు మాట్లాడుతూ తెలుగు సూపర్ స్టార్ కృష్ణ గారితో జమదగ్ని సినిమా చేశాను.
దర్శకుడు శివనాగు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారితో నెహ్రూ మూవీ చేశారని తెలిసి సంతోషంతో మధురైసింగం సాంగ్ లాంచ్ చెయ్యటానికి ఒప్పుకొన్నాను.
  మధురైసింగం సాంగ్స్ చాలా బాగున్నాయి. తమిళ లిరిక్ రైటర్స్ సాంగ్స్ బాగారాశారు. శివనాగు మేకింగ్ తమిళ నెటివిటీకి దగ్గరగా ఉంది. పాటలు లాగే మూవీకూడా బాగుంటుంది అనుకుంటున్నాను. దర్శకుడు శివనాగు గర్వంలేని మంచి మనిషి, వినయం,విధేయత కలిగిన వ్యక్తి. తమిళం లో దర్శకుడి గా ఎంతోస్థాయికి ఎదుగుతాడు. తమిళనాడు లో మధురైసింగం ట్రెమండరస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మధురైసింగం నిర్మాత, దర్శకుకు లకు నాసహాయసహకారాలు పూర్తిగా ఉంటాయని మీడియా ముఖంగా మాటిస్తున్నానని ప్రామిస్ చేశారు కె.భారతీరాజా గారు.
   దర్శకుడు నర్రాశివనాగు మాట్లాడుతూ తమిళ భీష్మపితామహులైన లెజెండరీ డైరెక్టర్ కె. భారతీరాజా గారు నాభుజము తట్టి సాంగ్స్ మెచ్చుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *