రౌద్ర‌రూపాయ న‌మ` చిత్రం నుండి `హ‌ల్లో మీమ్స్ వాలా` లిరిక‌ల్  సాంగ్ లాంచ్ !!

రౌద్ర‌రూపాయ న‌మ` చిత్రం నుండి `హ‌ల్లో మీమ్స్ వాలా` లిరిక‌ల్  సాంగ్ లాంచ్ !!

విభిన్న‌మైన టైటిల్  తో ఆక‌ట్టుకుని…విన‌సొంపైన  పాట‌ల‌తో ఇటు ఇండ‌స్ట్రీలో అటు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు రేకెత్తిస్తోన్న చిత్రం `రౌద్ర రూపాయ‌న‌మః`. `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం  రావుల ర‌మేష్ క్రియేష‌న్స్ పతాకంపై పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో రావుల ర‌మేష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం నుండి ప‌బ్ సాంగ్ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ లాంచ్ చేశారు. ` హ‌ల్లో హ‌ల్లో మీమ్స్ వాలా…పుల్ గా ఫోక‌స్ ఆన్ మీ రో…హ‌ల్లో హ‌ల్లో ట్రోల్స్ వాలా మేక్ మి మేక్ మి ఫేమ‌స్ రో ` అంటూ సాగే ఈ ప‌బ్ సాంగ్ ను  సురేష్ గంగుల ర‌చించ‌గా జాన్ భూష‌ణ్  స్వ‌ర‌ప‌రిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ…“ టైటిల్ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. పాట‌లు కూడా చూశాము..యువ‌త‌ను ఉర్రూత‌లూగించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం విజ‌యం సాధించి యూనిట్ అంద‌రికీ మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

బిఆర్ య‌స్ పార్టీ స్టేట్  యూత్ లీడ‌ర్ ఎస్‌.శివ ప్ర‌కాష్  మాట్లాడుతూ “ రౌద్ర రూపాయ న‌మః` టైటిల్ బాగుంది. అలాగే ఈ రోజు త‌ల‌సాని శ్రీనివాస యాదవ్ గారి చేతుల మీదుగా లాంచ్ అయిన ప‌బ్ సాంగ్ చాలా ఎన‌ర్జిటిక్ ప్ర‌జంట్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా ఉంది. ఈ సినిమా డైర‌క్ట‌ర్ పాలిక్ గారికి, నిర్మాత రావుల ర‌మేష్ గారికి టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్ “ అన్నారు.

నిర్మాత రావుల ర‌మేష్ మాట్లాడుతూ…“త‌ల‌సాని గారి చేతుల మీదుగా మా చిత్రంలోని పంబ్  సాంగ్ లాంచ్ కావ‌డం  ఎంతో ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు మంచి స్పంద‌న వస్తోంది. ద‌ర్శ‌కుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో సినిమాను గ్రాండ్ గా  రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

న‌టుడు వెంక‌ట్  మాట్లాడుతూ…“ మా చిత్రంలోని మూడో సాంగ్ త‌ల‌సాని గారి చేతుల మీదుగా లాంచ్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ…“ మా చిత్రంలోని ప‌బ్ సాంగ్ లాంచ్ చేసి చిత్ర యూనిట్ ని బ్లెస్ చేసిన త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ గారికి ధ‌న్య‌వాదాలు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ పాట రాయించి పిక్చ‌రైజ్ చేశాము.  క్రేజీ లిరిక్స్ తో పాటు ట్రెండీ మ్యూజిక్ తో ఈ పాట ఉంటుంది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కావొచ్చాయి. త్వ‌ర‌లో విడ‌దుల తేదీ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

మోహ‌న సిద్దిఖి మాట్లాడుతూ…“ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ ఎంతో విన‌సొంపుగా ఉన్నాయి. ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

ర‌ఘు, వెంక‌ట్, మోహ‌న సిద్దిఖి, పాయ‌ల్ ముఖర్జీ,  సీనియ‌ర్ న‌టుడు సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్,  ర‌ఘు, వెంక‌ట్  ముఖ్య పాత్ర‌ల్లో  న‌టిస్తోన్న ఈ చిత్రానికి  డిఓపీః గిరి-వెంక‌ట్;  సంగీతంః జాన్ భూష‌న్‌; స్టంట్స్ః ర‌న్ ర‌వి;  ఎడిట‌ర్ః రామ‌కృష్ణ అర్ర‌మ్‌; ఆర్ట్ః సురేష్ భీమ‌గాని;  లిరికల్ వీడియో: నిశాంత్ ; పాట‌లుః సురేష్ గంగుల‌;   పీఆర్వోః ర‌మేష్ చందు, స్టోరీ: ఎస్ వింద్యా రెడ్డి; నిర్మాతః రావుల ర‌మేష్‌;  స్క్రీన్ ప్లే- మాట‌లు-ద‌ర్శ‌క‌త్వంః పాలిక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *